
📌 Key Points
- డీఎంకే అధినేత స్టాలిన్ టీవీకే విజయ్‌కి కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై శుభాకాంక్షలు తెలిపారు.
- కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి మిత్రపక్షాలు తీసుకున్న నిర్ణయాన్ని స్టాలిన్ ప్రశంసించారు.
- డీఎంకే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని, మరో ఎన్నికలకు తావులేదని స్టాలిన్ స్పష్టం చేశారు.
- కాంగ్రెస్‌తో పొత్తు తెగిపోయిందని, వామపక్షాలు, విదుతలై చిరుతైగళ్ కచ్చి డీఎంకేకు మద్దతుగా నిలిచాయి.
తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగడంతో డీఎంకే అధినేత స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ, వామపక్షాలు, మిత్రపక్షాల నిర్ణయాన్ని ప్రశంసించారు. డీఎంకే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
స్టాలిన్ కీలక ట్వీట్: కొత్త ప్రభుత్వానికి మద్దతు
టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిన నేపథ్యంలో డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కీలక ట్వీట్ చేశారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సీట్లు రానప్పటికీ గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించామని ఆయన గుర్తుచేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డుపడబోమని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తామని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికీ మెజారిటీ లభించని పరిస్థితిలో, తమ మిత్రపక్షాలు ఏ నిర్ణయం తీసుకున్నా వారి నిర్ణయాన్ని గౌరవిస్తామని, సమన్వయంతో వ్యవహరించాలని, స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేలా చూడాలన్నారు. అంతేగానీ మరో ఎన్నికలకు దారి తీయకూడదని తాము నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని నివారించడానికి, తమిళనాడులో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము మద్దతు తెలిపినప్పటికీ, విధానపరంగా డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమిలోనే కొనసాగుతామని తమ కూటమి సహచరులు చేసిన ప్రకటనను స్టాలిన్ స్వాగతించారు.
అయితే కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని తుంగలో తొక్కిందని, అదేరోజు కాంగ్రెస్‌తో తమకు సంబంధాలు తెగిపోయాయని అన్నారు. అదే సమయంలో, కమ్యూనిస్ట్ నాయకులు కామ్రేడ్ షణ్ముగం, కామ్రేడ్ వీరపాండియన్‌లతో పాటు విదుతలై చిరుతైగళ్ కచ్చి పార్టీ నాయకుడు తిరుమావళవన్, తాము డీఎంకేతో చేతులు కలిపి తమిళనాడు హక్కులు, ప్రజల సంక్షేమం కోసం పోరాడుతూనే ఉంటామని ప్రకటించారన్నారు. తద్వారా వారు డీఎంకేపై తమ విశ్వాసాన్ని ప్రదర్శించారన్నారు. ఈ కీలక సమయంలో తమతో దృఢంగా నిలబడిన నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాలకు మంచి చేసేలా కొత్త ప్రభుత్వ పనితీరు ఉంటుందని ఆకాక్షిస్తున్నట్లు స్టాలిన్ పేర్కొన్నారు.
డీఎంకే కూటమి భవిష్యత్తు: మిత్రపక్షాల నిర్ణయం
కాంగ్రెస్‌తో తెగిన బంధం: వామపక్షాల విశ్వాసం
ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీసింది. స్టాలిన్ ప్రకటనతో రాజకీయ అనిశ్చితి తొలగి, స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమమైంది. భవిష్యత్తులో డీఎంకే పాత్ర కీలకం కానుంది.


