
మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా, ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా ‘స్టాలిన్’ ట్రైలర్ విడుదలైంది. ఈ రీ-రిలీజ్ చిత్రం ప్రేక్షకులను మళ్ళీ అలరించేందుకు సిద్ధమవుతోంది.
Key Points
మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజుకు స్టాలిన్ ట్రైలర్ విడుదల
త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా రీ-రిలీజ్ అవుతోంది
ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మళ్ళీ థియేటర్లలో
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అప్డేట్స్ రానున్నాయి
స్టాలిన్ మూవీ రీ-రిలీజ్
మెగాస్టార్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . ఈనెల 22 న చిరంజీవి 70 వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు . ఈ సందర్భంగా మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ స్టాలిన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు . త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు . తాజాగా స్టాలిన్ రీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు . ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించారు . ఈ చిత్రంలో ఖుష్బు , ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు . నాగబాబు నిర్మించిన ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది .
మరోవైపు ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాల అప్ డేట్ వచ్చే అవకాశముంది . ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు . బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు . అంతేకాకుండా అనిల్ రావిపూడితోనూ చిరంజీవి జతకట్టారు . పుట్టినరోజు ఈ సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది .
చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు
కొత్త సినిమా అప్డేట్స్
చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా స్టాలిన్ రీ-రిలీజ్ ట్రైలర్ ప్రేక్షకులను అలరించనుంది. మెగాస్టార్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలోనే వెలువడనున్నాయి.


