|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా ఫ్యాన్స్ ఆగ్రహం: స్టాండప్ కమెడియన్ అనుదీప్ పరార్! కామెడీ సెంటర్ల మూసివేత!!

Published: 12-04-2026, 9:05 AM
మెగా ఫ్యాన్స్ ఆగ్రహం: స్టాండప్ కమెడియన్ అనుదీప్ పరార్! కామెడీ సెంటర్ల మూసివేత!!
  • మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ అనుదీప్ స్టాండప్ కామెడీ.
  • పవన్ కళ్యాణ్, నిహారికపై అనుచిత వ్యాఖ్యలు.
  • అభిమానుల నుండి బెదిరింపులు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు.
  • హైదరాబాద్‌లో స్టాండప్ కామెడీ సెంటర్లు మూసివేత.

స్టాండప్ కమెడియన్ అనుదీప్ మెగా ఫ్యామిలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. పవన్ కళ్యాణ్, నిహారికలను టార్గెట్ చేయడంతో మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనుదీప్ పరారీలో ఉండగా, కామెడీ సెంటర్లు మూతపడ్డాయి.

మెగా ఫ్యామిలీపై అనుదీప్ కామెంట్స్

Anudeep: స్టాండప్ కమెడియన్ అనుదీప్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల కాలంలో స్టాండప్ కామెడీ పేరుతో సెలబ్రిటీలు రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత కొంతకాలంగా స్టాండప్ కమెడియన్స్ చేస్తున్నటువంటి ఈ కామెడీ పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకతలు వస్తున్నాయి. అయితే ఇటీవల అనుదీప్ అనే స్టాండప్ కమెడియన్ ఏకంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వారి గురించి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో పాటు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక విడాకుల (Niharika Divorce)గురించి ప్రస్తావించారు.

ఇలా వీరి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ కామెడీ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో అనుదీప్ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తను వెంటనే మెగా కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారికి అ బహిరంగ క్షమాపణలు చెప్పాలి లేదంటే తన అంతు చూస్తాం అంటూ బెదిరింపులకు దిగారు. అలాగే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

అభిమానుల ఆగ్రహం, ఫిర్యాదులు

ఇలా అనుదీప్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటంతో పలువురు జనసేన నాయకులు సైతం అనుదీప్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ విధంగా స్టాండప్ కమెడియన్ అనుదీప్ గురించి మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అనుదీప్ పరారీలో ఉన్నారు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉండటం విశేషం. అనుదీప్ మెగా కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో ఈయన తీరు పట్ల మెగా అభిమానులు మాత్రమే కాకుండా బాలయ్య అభిమానులు అలాగే నారా లోకేష్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుదీప్ వ్యాఖ్యలతో వివాదం చెలరేగడంతో నిర్వాహకులు స్టాండప్ కామెడీ నిలిపివేయటమే కాకుండా హైదరాబాదులో సోమాజిగూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్ లలో ఉన్న స్టాండప్ కామెడీ సెంటర్లను పూర్తిగా నిలిపివేశారు.

రామ్ చరణ్ ఉపాసనపై అనుదీప్ కామెంట్స్..

మూతపడిన స్టాండప్ కామెడీ సెంటర్లు

ఇలా మెగా కుటుంబం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే అభిమానులు ఈయనపై పలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేస్తున్నారు. స్టాండప్ కామెడీ పేరుతో వ్యక్తిగత విషయాల గురించి విమర్శిస్తూ ఒక నీచపు సంస్కృతిని అవలంబిస్తున్నారంటూ అభిమానులు మండిపడుతున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక నిహారిక పవన్ కళ్యాణ్ విడాకుల గురించి మాత్రమే కాకుండా ఉపాసన రాంచరణ్ గురించి కూడా అనుదీప్ మాట్లాడిన సంగతి తెలిసిందే .రామ్ చరణ్ ఉపాసన కంటే తక్కువగా సంపాదిస్తున్నారని, ఉపాసనని ఎప్పటికీ చేరుకోలేరు అంటూ కామెంట్ లు చేశారు.

అనుదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. వ్యక్తిగత విమర్శలు సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన స్టాండప్ కామెడీపై చర్చకు దారితీసింది. ప్రస్తుతం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.