
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాజాగా ఓ వైరల్ వీడియోలో కనిపించారు. ఈ వీడియోలో ఆయన బర్త్‌డే పార్టీలో మందు బాటిల్ దొంగతనం చేసినట్లు కనిపిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.
Key Points
సీనియర్ నటుడు సంజయ్ దత్ బర్త్‌డే పార్టీలో మందు బాటిల్ దొంగతనం చేశారు.
ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంజయ్ దత్ త్వరలోనే 'ది రాజా సాబ్' మరియు 'అఖండ-2' సినిమాలలో కనిపించనున్నారు.
సంజయ్ దత్ వైరల్ వీడియో
బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ (Sanjay Dutt)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన హిందీలో తమిళ చిత్రాల్లో నటించి హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలో నటించి విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్నారు. తెలుగులో ‘డబుల్ ఇస్మార్ట్’(Double iSmart) మూవీలో కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. త్వరలో సంజయ్ దత్ ‘ది రాజా సాబ్’(The Raja Saab) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో ప్రభాస్, నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మారుతి తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
అలాగే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘అఖండ-2’(Akhanda-2) సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, సంజయ్ దత్ అందరూ చూస్తుండగానే మందు బాటిల్ దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ బర్త్ డే పార్టీకి వెళ్లిన ఆయన ఫొటో గ్రాఫర్స్‌కు స్టిల్స్ ఇస్తున్నారు. ఈక్రమంలోనే అక్కడికి కేకును తీసుకువచ్చారు. ఇక అందులో ఉన్న మందు బాటిల్ చూసిన ఆయన వెంటనే దాన్ని తీసుకొని జేబులో పెట్టుకోనే ప్రయత్నం చేశాడు. కెమెరాలు ఉన్నయన్న సంగతి మర్చిపోయి అలా మందు బాటిల్ తీసుకొని దాచుకోవడం కెమెరా కంటపడింది. ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు అంత పెద్ద స్టార్ అయి ఉండి ఇదేం పాడు బుద్ధి అని తిడుతున్నారు. చిన్న మందు బాటిల్ కోసం కక్కుర్తి పడటం ఏంటని ట్రోల్ చేస్తున్నారు.
నెటిజన్ల విమర్శలు
సంజయ్ దత్ సినిమాలు
సంజయ్ దత్‌కు సంబంధించిన ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన నటుని ఇమేజ్‌పై ప్రభావం చూపుతుందో లేదో చూడాలి.


