
ప్రముఖ నటుడు, నిర్మాత తరుణ్ అరోరా తన భార్య అంజల జావేరితో ఉన్న తన వివాహ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. వారి వివాహం, పిల్లలు లేకపోవడం వెనుక ఉన్న కారణాలను ఆయన వివరించాడు.
Key Points
తరుణ్ అరోరా మరియు అంజల జావేరి 20 ఏళ్లుగా వివాహితులు.
వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.
పిల్లలు లేకపోవడానికి కారణం వారి ఇష్టం.
అంజల జావేరి వెంకటేష్ సరసన చాలా సినిమాలు చేసింది.
తరుణ్ అరోరా షాకింగ్ వెల్లడి
స్టార్ నటుడు నిర్మాత తరుణ్ అరోరా(Tarun Arora)కు పరిచయం అక్కర్లేదు. ఆయన పలు చిత్రాలో విలన్ పాత్రలు చేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఎక్కువగా తరుణ్ తమిళ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాకుండా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కాటమరాయుడు, జయ జానకి నాయక, ఖైధీ నంబర్ 150, అమర్ అక్బర్ ఆంటోనీ(Amar Akbar Antony), సీటిమార్, రామబాణం, కాంచన-3, భోళా శంకర్(Bhola Shankar) వంటి మూవీస్ చేశారు. ప్రస్తుతం అడపా దడపా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.
అంజల జావేరి మరియు వెంకటేష్ సినిమాలు
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తరుణ్ అరోరా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నాకు అంజలా(Anjala Zaveri)కి పెళ్లి జరిగి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. మా మధ్య బంధం ఏర్పడినప్పటికీ పిల్లలను మాత్రం కనలేదు. ఎందుకంటే.. దానికి ఓ కారణం ఉంది. సాధారణంగా పెద్దలు కుదిర్చిన జంటల్లో ప్రేమ, బాండింగ్ పెరగడానికి పిల్లల్ని కంటూ ఉంటారు. కానీ మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు. నేను అంజలా ప్రేమించి వివాహం చేసుకున్నాము.
20 ఏళ్ల వివాహ జీవితం
మా మధ్య ఎప్పటికీ ప్రేమ ఉంటుందని నమ్ముతాము కాబట్టి పిల్లలను కనాలని అనుకోలేదు. అంజలా జవేరి నాకు చిన్న పాపాయిలాగే అనిపిస్తుంది. అందుకే భవిష్యత్తులో పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నాము’’ అని చెప్పుకొచ్చాడు. కాగా, అంజలి జావేరి టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే తరుణ్‌తో ప్రేమలో పడింది. ఈ అమ్మడు వెంకటేష్ సరసన ప్రేమించుకుందాం రా, భలేవాడు, శంకర్ దాదా mbbs, సమర సింహా రెడ్డి, వంటి సినిమాలతో ఫేమ్ తెచ్చుకుంది. అలాగే బాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్ట్స్ చేసింది.
తరుణ్ అరోరా మరియు అంజల జావేరిల వివాహ జీవితం, వారి నిర్ణయాల గురించి ఈ కథనం వెల్లడిస్తుంది. వారి ప్రేమ, బంధం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోవచ్చు.


