
📌 Key Points
- రానా దగ్గుబాటి లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా, బాహుబలి మినహా హిట్ ట్రాక్ నిలబడలేదు.
- రానా ఎన్ని భారీ ప్రాజెక్టులు చేసినా, పెద్దగా సక్సెస్ అవ్వకపోవడంతో స్టార్‌డమ్ రాలేదు.
- వెంకటేష్ సినిమా ఎంపిక నిర్ణయాల వల్లే రానాకు స్టార్‌డమ్ దక్కలేదని వస్తున్న వార్తలు.
- వెంకీ స్టోరీ సెలెక్షన్స్ మరింత మెరుగుపడితేనే రానాకు సక్సెస్ సాధ్యమని కథనం సూచిస్తుంది.
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కెరీర్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాహుబలి విజయం తర్వాత కూడా ఆయన స్టార్‌డమ్ అందుకోలేకపోవడానికి కారణాలపై చాలా ఊహాగానాలున్నాయి. తాజాగా, ఆయన పెద్దనాన్న వెంకటేష్ సినిమాల ఎంపికే దీనికి అడ్డుపడుతోందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.
రానా స్టార్‌డమ్‌పై ఆగిపోయిన వడి
Rana Daggubati : టాలీవుడ్ యంగ్ హీరో రానా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటినుంచి మంచి కంటెంట్ సినిమాలను చేస్తూ వస్తున్నాడు. కానీ బాహుబలిని మించి ఏ సినిమా కూడా సక్సెస్ టాక్ ని అందుకోలేక పోతుంది. ఈమధ్య ఈ హీరో సినిమాలను చేయడంతో పాటుగా సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు. రానా ఎంత భారీ ప్రాజెక్టులో నటించినా కూడా అవి పెద్దగా సక్సెస్ అవ్వకపోవడంతో అతనికి స్టార్డం రాలేదు.. అయితే రానా స్టార్ హీరో అవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటూ గతంలో చాలాసార్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు అలాంటి వార్త మరొకటి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. అదేంటంటే రానా స్టార్ అవ్వకపోవడానికి కారణం ఓ వ్యక్తి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ వ్యక్తి ఎవరు? ఆయన ఏం చేశారో? అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
రానా అడపాదడప సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సో సో గానే ఉన్నాయి.. దాంతో ఆయన హీరోగా సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా కూడా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోలేక పోతున్నాడు. రానా ఎందుకు హీరోగా నిలబడలేకపోయాడనే విషయంలో చాలామంది చాలా రకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన హిట్ ట్రాక్ ను మెయింటైన్ చెయ్యలేకపోతున్నాడు. దానికి కారణం హీరో వెంకటేష్ అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. రానా ఎలాంటి సినిమాలు చేయాలనే విషయం మీద వెంకటేష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికి ఆ సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. వెంకీ సెలెక్ట్ చేసిన సినిమాలో రానాకి పెద్దగా సక్సెస్ ని అంది ఇవ్వలేకపోతున్నాయి. దానివల్లే అతను హిట్ ట్రాక్ ని మైంటైన్ చేయలేకపోతున్నాడు. వెంకీ స్టోరీ సెలక్షన్స్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే తప్ప రానా సక్సెస్ అవ్వడం కష్టమే.. మరి నెక్స్ట్ ఎలాంటి స్టోరీ తో రానా ప్రేక్షకులు ముందుకు వస్తాడో చూడాలి.
వెంకటేష్ ప్రభావమే రానా ఎదుగుదలకు అడ్డా?
బాహుబలి తర్వాత కూడా సక్సెస్ ఎందుకు రాలేదు?
లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ మంచి సక్సెస్ ను అందించలేదు.. కానీ రానా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. బాహుబలి సినిమాతో రానా బల్లాలదేవగా మారిపోయాడు. ఈ సినిమా అతని క్రేజ్ ని ఎంతగా పెంచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరో అవ్వకపోయినా రా నాకు మాత్రం మంచి టాక్ ని అందించింది. డిఫరెంట్ పాత్ర ఏదైనా ఉంది అంటే చాలు ఆ పాత్రలో రానా నటించడానికి సిద్ధమవుతుంటాడు. తేజ డైరెక్షన్లో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈమధ్య ప్రొడ్యూసర్ గా వరుసగా సినిమాలు నిర్మిస్తూ బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి రానా హీరోగా కన్నా నిర్మాతగా సక్సెస్ అవుతాడేమో చూడాలి..
వెంకటేష్‌పై వస్తున్న ఈ వార్తలు ఎంతవరకు నిజమో స్పష్టంగా తెలియదు. రానా స్టార్ హీరోగా నిలబడాలంటే బలమైన కథ, సరైన ఎంపిక అవసరం. రాబోయే రోజుల్లో ఆయన ఎలాంటి సినిమాలతో ముందుకు వస్తారో వేచి చూడాలి.


