|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్ నోలన్ సినిమా.. ఏడాదికి ముందే టికెట్లు విడుదల

Published: 17-07-2025, 3:18 AM
స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్ నోలన్ సినిమా.. ఏడాదికి ముందే టికెట్లు విడుదల

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’ టికెట్లను విడుదల చేశాడు. 2026 జులై 17న విడుదల కానున్న ఈ ఎపిక్ యాక్షన్ ఫాంటసీ చిత్రంపై అభిమానుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.

Key Points

1

క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన 'ది ఒడిస్సీ' సినిమా టికెట్లు ఏడాది ముందే విడుదల

2

IMAX 70mm థియేటర్లలో మాత్రమే టికెట్లు అందుబాటులో ఉన్నాయి

4

రూ. 2100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది

‘ది ఒడిస్సీ’ సినిమా విడుదల తేదీ

హాలీవుడ్‌ టాప్ ‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌(Christopher Nolan) సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు . 2023 లో ఓపెన్‌హైమర్ సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకున్నారు . 96 వ అకాడమీ అవార్డ్స్ ‌ లో ఏకంగా ఏడు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డులను అందుకుంది. అయితే , ఈ చిత్రం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ ది ఒడిస్సీ ‘(The Odyssey).. ఈ మూవీకి రచన, సహ-నిర్మాత కూడా క్రిస్టోఫర్‌ నోలన్‌ కావడం విశేషం . ఒక ఎపిక్ యాక్షన్ ఫాంటసీ చిత్రంగా రెడీ అవుతున్న ఈ ప్రాజెక్ట్‌ 2026 జులై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, నేటి నుంచే టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

గ్రీకు కవి హోమర్ రాసినట్లు చెప్పబడే పురాతన ఇతిహాసం నుంచి ‘ ది ఒడిస్సీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మాట్ డామన్ హీరోగా నటిస్తున్నారు. ఇథాకా ద్వీపానికి గ్రీకు రాజుగా ఆయన నటించాడు . ప్రపంచంలోనే మొదటిసారి పూర్తిగా IMAX కెమెరాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు . ట్రోజన్ యుద్ధం అనంతరం ఒడిస్సియస్ తన స్వదేశం ఇథాకాకు తిరిగి రావడానికి చేసే సాహసయాత్రను ఆధారంగా తీసుకుని, నోలన్ తనదైన శైలిలో మోడరన్ మానవతా విలువలతో ఈ మూవీలో మిళితం చేశారు. ఈ సినిమా కోసం రూ . 2100 కోట్లు ఖర్చు చేస్తున్నారు .

IMAX 70mm టికెట్ల ప్రీ-బుకింగ్

ప్రపంచవ్యాప్తంగా అలాంటి థియేటర్స్‌ 30 మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న IMAX 70mm టిక్కెట్ల ప్రీ-సేల్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి . ఇది నోలన్ సినిమాలపై ఉన్న క్రేజ్‌ను సూచిస్తుంది . సినిమా విడుదల కావడానికి సరిగ్గా ఒక సంవత్సరం ముందే టిక్కెట్లు అమ్మకానికి వచ్చేశాయి . అయతే ,  IMAX 70mm కోసం మాత్రమే ఈ టికెట్లు అందుబాటులో ఉండటంతె అభిమానులు నిరాశ చెందుతున్నారు . IMAX 70mm థియేటర్స్ ‌ ప్రపంచంలో కేవలం 30 మాత్రమే ఉన్నాయి. IMAX స్క్రీన్స్ ‌ లో ఈ చిత్రాన్ని చూస్తే ప్రత్యేకమైన అనుభూతి ఉంటుందని నోలన్ ‌ చెప్పడంతో మరింత క్రేజ్ ‌ పెరిగింది .

సినిమా బడ్జెట్ మరియు విశేషాలు

నోలన్‌ సినిమాలకు జులై సెంటిమెంట్‌ వార్నర్‌ బ్రదర్స్‌ కంపెనీతో నోలన్ ‌ ఎక్కువ సినిమాలు చేశారు . ఇప్పటి వరకు నోలన్‌ రూపొందించిన ఎక్కువ శాతం సినిమాలను ఈ నిర్మాణ సంస్థే నిర్మించింది. నోలన్‌ తన సినిమాలను జూన్‌ – జూలై సీజన్‌లో రిలీజ్‌ చేయడానికి ఇష్టపడతారు. ఆ సెంటిమెంట్‌నే మళ్లీ రిపీట్‌ చేశారు. నోలన్‌ గత ఆరు చిత్రాల్లో 5 సినిమాలు జూలైలో రిలీజ్‌ కావడం విశేషం. ఇప్పుడు ది ఒడస్సీ కూడా 2026 జులై 17 న విడుదల కానుంది .

మొత్తానికి, క్రిస్టోఫర్ నోలన్ సినిమాపై ఉన్న అభిమానం ఈ టికెట్ల ప్రీ-బుకింగ్ ద్వారా స్పష్టమవుతోంది. IMAX అనుభవాన్ని ఆస్వాదించాలనుకునే వారు తప్పక టికెట్లు బుక్ చేసుకోవాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.