|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ పార్ట్‌పై దురదపెడితే నన్ను పిలువు అని వేధించాడు.. స్టార్ హీరోపై రాధికా అప్టే సంచలన వ్యాఖ్యలు!

Published: 04-10-2025, 10:54 AM
ఆ పార్ట్‌పై దురదపెడితే నన్ను పిలువు అని వేధించాడు.. స్టార్ హీరోపై రాధికా అప్టే సంచలన వ్యాఖ్యలు!

నటి రాధికా అప్టే ఓ స్టార్ హీరోపై చేసిన సంచలన కాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో కలకలం రేపాయి. తనకెదురైన అసభ్యకర వేధింపులను ఆమె బయటపెట్టడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Key Points

1

స్టార్ హీరో వేధింపులపై రాధికా అప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది.

2

ఒక తెలుగు స్టార్ హీరో ఎలివేటర్‌లో అసభ్యకరంగా మాట్లాడినట్లు వెల్లడించింది.

4

అయితే, ఆ హీరో పేరును మాత్రం రాధికా అప్టే బహిర్గతం చేయలేదు.

కాస్టింగ్ కౌచ్‌పై రాధికా అప్టే సంచలన వ్యాఖ్యలు

గత కొద్ది కాలంగా ఎంతోమంది హీరోయిన్లు తాము క్యాస్టింగ్ కౌచ్‌కు గురైనట్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు భయపడి వెనకడుగు వేస్తుంటే.. మరికొందరు మాత్రం తమకు జరిగిన అనుభవాలు చెప్పుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. తాజాగా, మరో హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ ఎదురైనట్లు తెలుపుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే(Radhika Apte) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ‘‘ఒక ప్రముఖ తెలుగు స్టార్ హీరో ఎలివేటర్‌లో వెళ్తున్నప్పుడు నాతో అసభ్యకరంగా మాట్లాడాడు.

నిజానికి ఆ హీరోకు నాకు అంత పరిచయం లేనప్పటికీ కావాలని నాతో అతిగా మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టాడు. ఎప్పుడైనా అర్థరాత్రి వేళ.. మీ బ్యాక్ దురదపెడితే.. నన్ను పిలవండి.. నేను మీ రూమ్‌కి వచ్చి రుద్దుతా అని వేధించాడు. దీంతో అది విని నేను షాక్ అయ్యాను. వెంటనే వాట్ అని చాలా సీరియస్ అయి తిట్టాను. పెద్ద గొడవ చేశాను.. దీంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు’’ అని చెప్పుకొచ్చింది. కానీ ఆ హీరో పేరును మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతం రాధికా అప్టే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అసలు ఆ హీరో ఎవరా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఎలివేటర్‌లో జరిగిన ఘటనను వివరించిన నటి

గుర్తుతెలియని స్టార్ హీరోపై తీవ్ర ఆరోపణలు

రాధికా అప్టే వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై మరోసారి చర్చకు దారితీశాయి. ఆ స్టార్ హీరో ఎవరనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆమె ధైర్యానికి అభినందనలు లభిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.