|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వీధుల్లో వడపావ్ అమ్ముతున్న స్టార్ హీరో.. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న వీడియో.. పచ్చిమిర్చి లేదంటూ!

Published: 08-06-2025, 9:45 AM
వీధుల్లో వడపావ్ అమ్ముతున్న స్టార్ హీరో.. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న వీడియో.. పచ్చిమిర్చి లేదంటూ!

కోట్ల రూపాయల ఆదాయం ఉన్న బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ముంబై వీధుల్లో వడపావ్ అమ్ముతూ కనిపించాడు. అతని ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం.

Key Points

1

అమీర్ ఖాన్ ముంబై వీధుల్లో వడపావ్ తయారు చేస్తున్న వీడియో వైరల్ అయింది.

2

సితారే జమీన్ పర్ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ ఘట్టం జరిగింది.

4

అమీర్ ఖాన్ యొక్క ఈ ప్రచార వ్యూహం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

అమీర్ ఖాన్ వీధి వ్యాపారం

ముంబై వీధుల్లో ఓ స్టార్ హీరో వడపావ్ అమ్ముతూ అందరికి షాక్ ఇచ్చాడు. కోట్లల్లో ఆదాయం ఉండే అగ్ర హీరో రోడ్లపై వడపావ్ అమ్మడం ఏంటని అందరి ఆశ్చర్యపోయారు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వీధుల్లో వడపావ్ అమ్మే వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

అసలు కథలోకి వెళితే.. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ స్నాక్స్ తయారు చేయడానికి ముంబై వీధుల్లోకి వచ్చి కొత్త ప్రయత్నం చేశాడు. దాదర్‌లో వడపావ్ తయారు చేస్తున్న పలు వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమయ్యాయి. ముంబై వీధుల్లో వడపావ్ తయారు చేసిన ఆమిర్ ఖాన్ ఓ వీడియోలో వడా, పావ్ పట్టుకొని కనిపించాడు.

చట్నీ రాసి బన్‌కు బజ్జీ కలిపాడు అమీర్ ఖాన్ . ఆ తర్వాత అతను స్నాక్స్ తయారు చేస్తున్నానని ఎవరో చెబుతుంటే కెమెరా వైపు చూస్తూ చిరునవ్వు నవ్వాడు. ఆ వీడియోలో “పచ్చిమిర్చి లేదు కదా. ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాను” అని అమీర్ ఖాన్ అనడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

సితారే జమీన్ పర్ ప్రమోషన్స్

అమీర్ ఖాన్ రోడ్లపైకి వచ్చి వడపావ్ చేయడంతో అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. అమీర్ ఖాన్‌తో వీడియోలు, ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. అయితే, అమీర్ ఖాన్ వీధుల్లో వడపావ్ అమ్మడానికి ఏ కారణం ఉంది. అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ సితారే జమీన్ పర్ .

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అమీర్ ఖాన్ వడపావ్ చేస్తూ, అమ్ముతూ కనిపించాడు. దీన్ని షూట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. “ఇటీవల వరుసగా సినిమాలు ఫ్లాప్‌లు కావడంతో వడపావ్ అమ్ముతున్నారేమో అనుకున్నా” అని ఒకరు కామెంట్ చేశారు.

నెటిజన్ల స్పందన

“ఫుడ్ గ్లౌజులు లేవా”, “ఎలాంటి గ్లౌజులు లేకుండా వడపావ్ తయారు చేస్తున్నాడు”, “సినిమా విడుదలకు ముందు ఇలాంటివి తప్పనిసరి”, “ఆయన ప్రచార వ్యూహాన్ని ఎవరు బీట్ చేయలేరు” అని పలు విధాలుగా ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ కామెంట్స్ చేశారు. ఇక ఈ వీడియోలో అమీర్ ఖాన్ బ్రౌన్ కలక్ టీ షర్ట్, డెనిమ్ జీన్స్ ధరించి కనిపించాడు.

అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సినిమా అయిన సితారే జమీన్ పర్ జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

అమీర్ ఖాన్ యొక్క ఈ ప్రత్యేకమైన ప్రమోషనల్ వ్యూహం సినిమాకు మంచి ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. సినిమా విజయం కోసం అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.