
📌 Key Points
- హీరోయిన్ రాజిషా విజయన్ గత ఎనిమిదేళ్లుగా వాట్సాప్ ఉపయోగించడం లేదు.
- రాజిషా సోషల్ మీడియా కంటే నిజ జీవితానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది.
- సమయాన్ని పుస్తకాలు చదవడానికి, సినిమాలు చూడటానికి ఉపయోగించమని రాజిషా సూచిస్తుంది.
- కలం కావాలి సినిమాలో మమ్ముట్టితో కలిసి నటించడం గొప్ప అనుభవమని రాజిషా తెలిపింది.
ప్రముఖ హీరోయిన్ రాజిషా విజయన్ గత ఎనిమిదేళ్లుగా వాట్సాప్ ఉపయోగించడం లేదని వెల్లడించింది. సోషల్ మీడియా కంటే నిజ జీవితానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని ఆమె చెప్పింది. దీనికి గల కారణాలను ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.
వాట్సాప్‌కు రాజిషా ఎందుకు దూరమయ్యారు?
Star Heroine: ఈ రోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ చూస్తారు. ముందుగా వాట్సాప్ మెసేజులు, తరువాత సోషల్ మీడియా, ఆ తరువాత రీల్స్ చూడటం అలవాటుగా మారింది. ఎంత సమయం గడుస్తుందో కూడా తెలియకుండా గంటల తరబడి స్క్రోల్ చేస్తుంటారు. కానీ హీరోయిన్ రాజిషా విజయన్ మాత్రం చాలా భిన్నమైన జీవనశైలిని ఎంచుకున్నారు.
మలయాళం, తమిళంలో ఎంతో పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఈమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజిషా విజయన్ చెప్పిన ప్రకారం, ఆమె గత ఎనిమిదేళ్లుగా వాట్సాప్ ఉపయోగించడం లేదంట. కాలేజ్ పూర్తి చేసిన తరువాత ఫేస్‌బుక్ కూడా పూర్తిగా వాడడం మానేశారంట. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా చాలా అరుదుగా మాత్రమే ఉపయోగిస్తారు. ఆమెకు వర్చువల్ ప్రపంచం కంటే నిజ జీవితమే ముఖ్యమని భావిస్తారంట.
ఆమె మాట్లాడుతూ..” మనుషులను ప్రత్యక్షంగా కలవడం చాలా విలువైన విషయం. ఫోన్ కాల్స్ లేదా మెసేజీల కంటే ముఖాముఖి మాట్లాడటం ఎక్కువ అర్థవంతంగా ఉంటుంది అని నేను భావిస్తాను. రీల్స్ వల్ల చాలా మంది ఫోన్‌కు బానిసవుతున్నారు. సమయం ఎంత ముఖ్యమో మనం గుర్తించలేకపోతున్నాము,” అని అన్నారు.
నిజ జీవితానికే మొదటి ప్రాధాన్యత అంటున్న హీరోయిన్
“ఆ సమయాన్ని పుస్తకాలు చదవడానికి ఉపయోగించవచ్చు. మంచి సినిమాలు చూడవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపవచ్చు,” అని రాజిషా తెలిపారు. సోషల్ మీడియా మన సమయాన్ని మెల్లగా తీసుకుపోతుందని ఆమె హెచ్చరించారు.
ఇక ఈ ఆమె ఈ మధ్యనే మమ్ముట్టి సూపర్ హిట్ సినిమా కలం కావాలి సినిమాలో హీరోయిన్గా చేసింది. గురించి కూడా మాట్లాడారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించినది Jithin K Jose. అలాగే నటుడు Vinayakan కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మమ్ముట్టి గారి కెరీర్‌లో పెద్ద విజయంగా నిలిచింది.
మమ్ముట్టితో కలిసి పనిచేసిన అనుభవాలు పంచుకున్న రాజిషా
సినిమా గురించి మాట్లాడిన రాజిషా, “మమ్ముట్టి సర్ తన పాత్రలో చాలా సహజంగా మారిపోతారు. ఈ చిత్రంలో ఆయన స్టాన్లీ దాస్ అనే సీరియల్ కిల్లర్ పాత్ర పోషించారు. ఆయన ఎప్పుడు పాత్రలోకి వెళ్లారో నేను గమనించలేకపోయాను. ఆయనతో కలిసి నటించడం నాకు ఒక గొప్ప అనుభవం. ఇది నాకు పెద్ద పాఠంగా మారింది,” అని అన్నారు.
రాజిషా విజయన్ సోషల్ మీడియాకు దూరంగా ఉండటం, నిజ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం ఆదర్శనీయం. ఆమె మాటలు మనలో స్ఫూర్తిని నింపుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒక మార్గాన్ని చూపిస్తాయి.


