
టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా, ఓ స్టార్ హీరోయిన్ విజయ్ కోసం సూర్య సినిమానే వదులుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమేనా? ఎవరో ఆ హీరోయిన్?
Key Points
విజయ్ దేవరకొండ కోసం సూర్య సినిమాను కీర్తి సురేష్ వదులుకుందట!
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య 46వ చిత్రం ఆఫర్‌ను కీర్తి తిరస్కరించింది.
విజయ్ దేవరకొండతో కొత్త సినిమా కారణంగానే ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం.
గతంలో సూర్య-కీర్తి జంట నటించిన 'గ్యాంగ్' సినిమా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.
కీర్తి సురేష్ – సూర్య 46వ చిత్రం
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా తక్కువ టైమ్ లో హీరోగా స్టార్ డమ్ సంపాదించుకున్న విజయ్ కు ఈ మధ్య కాలం కలిసి రావడంలేదు చేసిన ప్రతీ సినిమా ప్లాప్ అవుతోంది. కాని విజయ్ ఇమేజ్, క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. సామాన్యులే కాదు స్టార్స్ లో కూడా విజయ్ ను ఇష్టపడేవారు ఉన్నారు. హీరోయిన్లు అయితే విజయ్ తో సినిమా అంటే కళ్లు మూసుకుని ఓకే చెపుతారు. ఇక ఓ స్టార్ హీరోయిన్ విజయ్ తో సినిమా కోసం పెద్ద సినిమానే వదిలేసిందట. ఆమె ఎవరో కాదు కీర్తి సురేష్.
టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కీర్తి సురేశ్, రీసెంట్ గా వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. బాలనటిగా తన ప్రయాణాన్ని మలయాళ సినిమాలతో స్టార్ట్ చేసిన కీర్తి, 2015లో తమిళ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అదే ఏడాది తెలుగులో నేను శైలజ సినిమాతో పరిచయమై, 2018లో మహానటి చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఆమెకు జాతీయ ఉత్తమ నటీ అవార్డు ను అందించింది.
విజయ్ దేవరకొండతో కొత్త సినిమా
ప్రస్తుతం కీర్తి తెలుగు, తమిళ భాషల్లో బిజీగా సినిమాలు చేస్తూ ఉన్నారు. బాలీవుడ్‌లో బేబీ జాన్ సినిమాతో ప్రవేశించినప్పటికీ, ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, కీర్తి సురేశ్ తమిళ స్టార్ హీరో సూర్య 46వ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు. దాంతో మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈక్రమంలో హీరోయిన్ గా కీర్తీని నటించమని అడిగితే నో చెప్పిందట.
ఫిలింనగర్ లో వార్తలు
విజయ్ దేవరకొండతో చేస్తున్న కొత్త సినిమా కారణంగానే ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించిందనే వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని, కీలక షెడ్యూల్స్ కు కీర్తి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని టాక్. గతంలో సూర్య–కీర్తి కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ జంట మళ్లీ కలిసి పనిచేసే అవకాశం మిస్ అయ్యింది. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
చివరగా, కీర్తి సురేష్ నిర్ణయం వెనుక నిజానికత ఏమిటో తెలియాల్సి ఉంది. విజయ్ దేవరకొండ సినిమా కారణంగానే ఆమె ఈ అవకాశాన్ని వదులుకుందా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనేది మరిన్ని వివరాలు వెలువడే వరకు వేచి చూడాలి.


