|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రెస్టారెంట్‌ మూసేసిన స్టార్‌ హీరోయిన్‌

Published: 04-09-2025, 1:47 AM
రెస్టారెంట్‌ మూసేసిన స్టార్‌ హీరోయిన్‌

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తన ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్ ‘బాస్టియన్’ను మూసివేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా ఆమెపై నమోదైన రూ. 60 కోట్ల మోసం కేసు దీనికి కారణం అని చర్చ జరుగుతోంది.

Key Points

1

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తన ‘బాస్టియన్’ రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

2

రూ. 60 కోట్ల మోసం కేసు ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు.

4

శిల్పా శెట్టి సినిమా, ఫుడ్, హాస్పిటాలిటీ రంగాలలో తనదైన ముద్ర వేసింది.

శిల్పా శెట్టి సంచలన నిర్ణయం

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి(Shilpa Shetty) సంచలన నిర్ణయం తీసుకుంది . ముంబై బాంద్రాలో ఉన్న తన లగ్జరీ రెస్టారెంట్ ‌ ‘బాస్టియన్‌’ను ( Bastian) మూసివేయనున్నట్లు ప్రకటించింది . గత కొద్దిరోజుల క్రితమే శిల్పా శెట్టి , ఆమె భర్త రాజ్ ‌ కుంద్రా రూ.60 కోట్ల మేర మోసం చేశారంటూ ఒక వ్యాపారావేత ​ ఆరోపణలు చేశాడు . ఆపై వారిమీద ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు . అనంతరం, ఈ కేసు దర్యాప్తును ఆర్థిక నేరాల విభాగం ( EOW) కి అప్పగించారు.

బాస్టియన్ రెస్టారెంట్ మూసివేత

” ముంబైలోని అత్యంత పేరుగాంచిన మా రెస్టారెంట్ ‌ బాస్టియన్ ‌ ను ఈ గురువారం మూసివేస్తున్నాం . ఒక శకం ముగిసింది . ఎన్నో లెక్కలేనన్ని జ్ఞాపకాలు, మరపురాని క్షణాలను ఇచ్చింది . ఎందరికో సంతోషాన్ని పంచిన ఈ వేదిక ఇకపై మూతపడనుంది . వీడ్కోలు పలికేందుకు గురువారం ఒక వేడుక నిర్వహిస్తున్నాం . వ్యాపార భాగస్వాములతో పాటు కొందరు సన్నిహితులు కూడా హాజరుకానున్నారు . త్వరలో సరికొత్త అనుభవాలతో మీ ముందుకు వస్తాం .’ అని ఆమె తెలిపారు .

రూ.60 కోట్ల మోసం కేసు ప్రభావం?

ముంబైలో ఆరుచోట్ల బాస్టియన్ ‌ పేరుతో వారికి బ్రాంచ్ ‌ లు ఉన్నాయి . 2016 లో ముంబై బాంద్రాలో ప్రారంభమైన మొదటి బ్రాంచ్ ‌ ను వారు మూసివేస్తున్నారు . కారణం ఏంటి అనేది వారు చెప్పలేదు . కానీ , మూసివేతకు ప్రధాన కారణం రూ . 60 కోట్ల మోసం కేసు అని తెలుస్తోంది . అయితే , శిల్పా శెట్టి తన సినిమా కెరీర్‌తో పాటు ఫుడ్, హాస్పిటాలిటీ రంగంలో కూడా తన మార్క్ వేసింది .

శిల్పా శెట్టి సినిమా రంగంతో పాటు వ్యాపార రంగాలలోనూ సత్తా చాటుతోంది. కానీ, రెస్టారెంట్ మూసివేత ఆమెకు ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.