|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మేమిద్దరం.. ఒకేసారి.. ఒకే హీరోను.. డేటింగ్ చేశాం.. స్టార్ హీరోయిన్ల సంచలనం

Published: 14-11-2025, 3:50 PM
మేమిద్దరం.. ఒకేసారి.. ఒకే హీరోను.. డేటింగ్ చేశాం.. స్టార్ హీరోయిన్ల సంచలనం

కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న ‘టు మచ్’ షో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా, క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజా ఎపిసోడ్‌లో ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు తమ పెళ్లికి ముందే ఒకే హీరోను ఒకేసారి డేటింగ్ చేసినట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Key Points

1

కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న 'టు మచ్' షో విమర్శలు ఎదుర్కొంటున్నా క్రేజ్ దక్కించుకుంటోంది.

2

ఈ స్టార్ హీరోయిన్లు పెళ్లికి ముందే ఒకే హీరోను ఒకేసారి డేటింగ్ చేసినట్లు తాజా ఎపిసోడ్‌లో వెల్లడించారు.

4

ఆ హీరో షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ లేదా కమెడియన్ అయి ఉంటాడని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.

‘టు మచ్’ షోలో సంచలన నిజాలు

కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న ‘టు మచ్’ షో.. మరీ టూ మచ్‌గా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. కరణ్ జోహార్‌ను మించిపోయారని.. ఇది జస్ట్ సెక్స్‌ను నార్మలైజ్ చేసే షో మాదిరిగా ఉందని తిట్టిపోస్తున్నారు. కానీ కార్యక్రమం క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఇక తాజా ఎపిసోడ్‌లో వీరిద్దరు ఒకేసారి.. ఒకే హీరోను.. డేటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. పెళ్లికి ముందేనని క్లారిటీ ఇచ్చారు. ఒకప్పుడు చాలా సీరియస్‌గా ఉన్న ఇష్యూను ఇప్పుడు ఎంత సిల్లీగా తీసుకుని నవ్వుకుంటున్నారో చెప్పారు. దీంతో జనాలు ఆ హీరో ఎవరు అయి ఉంటారని అంచనా వేస్తున్నారు. కొందరు షారుఖ్ ఖాన్ అంటే ఇంకొందరు అక్షయ్ కమార్ అని.. మరికొందరు ఓ కమెడియన్ అయి ఉంటాడని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా కాజోల్ అజయ్ దేవగన్‌ను పెళ్లి చేసుకోగా.. ట్వింకిల్ అక్షయ్‌ను మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోయారు.

ఒకే హీరోను డేట్ చేసిన హీరోయిన్లు

ఆ హీరో ఎవరని చర్చ

స్టార్ హీరోయిన్లు కాజోల్, ట్వింకిల్ ఖన్నా చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరలేపాయి. ఆ హీరో ఎవరై ఉంటారని సినీ అభిమానులు, నెటిజన్లు ఆసక్తిగా అంచనా వేస్తున్నారు. ఈ విషయం ‘టు మచ్’ షోకి మరింత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.