
నటులను నెత్తిన పెట్టుకొని ఊరేగవద్దంటూ తమిళ నటుడు సత్యరాజ్ చేసిన షాకింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై దర్శకుడు పేరరసు ఘాటుగా స్పందించారు. పూర్తి వివరాలు ఇక్కడ.
Key Points
నటులను నెత్తిన పెట్టుకోవద్దని సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు.
నటించడం మాత్రమే తెలుసు వారికి, ఐన్‌స్టిన్ లాగా చూడొద్దు అన్నారు.
సత్యరాజ్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
దర్శకుడు పేరరసు సత్యరాజ్‌ను తీవ్రంగా ఖండించారు.
సత్యరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Sathyaraj: తమిళ నటుడు సత్యరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల జరిగిన ఒక సంఘటనను ఉద్దేశిస్తూ.. నటులను నెత్తిన పెట్టుకొని ఊరేగడం మానుకోండి అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో, సత్యరాజ్ చేసిన ఈ కామెంట్స్ (Sathyaraj)పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? నటుడు సత్యరాజ్ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని చెప్తూనే ఉంటాడు. ఇందులో భాగంగానే ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.
Rahul Ramakrishna: తప్పు తెలుసుకున్నా.. ఇక నా పని నేను చేసుకుంటా.. వివాదంపై స్పందించిన రాహుల్ రామకృష్ణ
నటుల గురించి సత్యరాజ్ ఏమన్నారంటే..
“నటీనటులను తలపై పెట్టుకొని ఊరేగడం మానేయండి. వాళ్లకు చాలా తెలుసని అనుకోకండి. నటించడం మాత్రమే తెలుసు వాళ్ళకి. ఈ సమాజంలో జరుగుతున్న పెద్ద తప్పు ఏంటంటే.. నటులను ఐన్ స్టిన్ రేంజ్‌లో ఊహించుకోవడమే. వారేమీ పెరియార్, అంబేడ్కర్ లాంటి గొప్ప వ్యక్తులు కాదు. దర్శకుడు చెప్పింది అనుసరిస్తారు అంతే” అంటూ పోస్టులో రాసుకొచ్చాడు సత్యరాజ్. అయితే, ఈ పోస్టును ఇండైరెక్ట్ గా ఒక హీరోని టార్గెట్ చేసి కావాలని అలా మాట్లాడాడు అంటూ కొంతమంది మండిపడుతున్నారు.
దర్శకుడు పేరరసు ఘాటు స్పందన
తాజాగా సత్యరాజ్ కామెంట్స్ పై దర్శకుడు పేరరసు తీవ్రంగా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. “నటులకు ఏమీ తెలియదనుకుంటే ఎలా. మీరూ కూడా ఒక నటుడే కదా. మీరెందుకు సందేశం ఇస్తున్నారు. ఎంజీఆర్ ఉన్నప్పుడు ఇలా అనే ధైర్యం మీకుండేదా? పార్టీ కోసం శ్రమించిన వాళ్ళను పక్కన పెట్టి సత్యరాజ్ కూతురికి పదవి ఎందుకు ఇచ్చారని అడగాలి. నటన అనేది వృత్తి మాత్రమే. వారిలో ప్రపంచ జ్ఞానం కల్గినవారు చాలా మంది ఉన్నారు”అంటూ చెప్పుకొచ్చాడు.
సత్యరాజ్ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. నటుల పాత్ర, వారి జ్ఞానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై మరింత మంది స్పందించే అవకాశం ఉంది.


