|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: పెళ్ళైనా తగ్గని రష్మిక ఫైర్.. బ్యాంకాక్ లో మెట్టెలతోనే విధ్వంసం సృష్టిస్తోందిగా!

Published: 18-04-2026, 4:05 AM
షాకింగ్: పెళ్ళైనా తగ్గని రష్మిక ఫైర్.. బ్యాంకాక్ లో మెట్టెలతోనే విధ్వంసం సృష్టిస్తోందిగా!
  • విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి తర్వాత బ్యాంకాక్ లో షూటింగ్!
  • రోజుకు 8 గంటలు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్న రష్మిక మందన్న.
  • ఫైట్స్ కోసం అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ ఆధ్వర్యంలో శిక్షణ!
  • పెళ్ళైనా మెట్టెలు తీయకుండా రష్మిక డెడికేషన్ చూసి ఫాన్స్ ఫిదా!

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. పెళ్ళైన తర్వాత కూడా ఆమె తన సినిమా కెరీర్ పట్ల అంతే అంకితభావంతో ఉంది. బ్యాంకాక్ లో ఆమె చేస్తున్న సాహసాలు చూస్తే షాక్ అవుతారు!

బ్యాంకాక్ లో రష్మిక కఠిన శిక్షణ!

Rashmika Mandanna : రష్మిక మందన్న ఇటీవలే విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ని ఆనందంగా గడుపుతుంది. పెళ్లి, రిసెప్షన్, హనీమూన్.. ఇలా ఒక నెల రోజులు గ్యాప్ తర్వాత విజయ్ – రష్మిక ఇద్దరూ తమ సినిమా వర్క్స్ లో బిజీ అయ్యారు. తాజాగా రష్మిక బ్యాంకాక్ కి వెళ్ళింది.

రష్మిక మందన్న మెయిన్ లీడ్ లో ఫిమేల్ లీడ్ ఓరియెంటెడ్ సినిమాగా మైసా రాబోతుంది. పోరాటం చేసే గోండు మహిళగా రష్మిక ఇందులో కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ లో రష్మిక యాక్షన్ ఎపిసోడ్స్ లో తన ఉగ్ర రూపం చూపించింది.

మెట్టెలు తోనే ఫైట్స్ అంటున్న ఫాన్స్!

తాజాగా మైసా మూవీ యూనిట్ రష్మిక ట్రైనింగ్ తీసుకుంటున్న ఫొటోలు షేర్ చేసి.. రష్మికమందన్న ప్రస్తుతం బ్యాంకాక్‌లో రోజుకు 8 గంటల పాటు కఠినమైన యుద్ధ శిక్షణ తీసుకుంటుంది. ఆమె అంతకుముందు ఎప్పుడూ చూడని యాక్షన్ అవతారంలో అందర్నీ ఆశ్చర్యపరచబోతోంది అని తెలిపారు.

మైసా మూవీ కోసం రష్మిక డెడికేషన్!

రష్మిక బ్యాంకాక్ లో ప్రతిరోజూ దాదాపు 8 గంటల పాటు మార్షల్ ఆర్ట్స్, స్టంట్ టెక్నిక్స్, హ్యాండ్ టు హ్యాండ్ యుద్ధ శిక్షణ తీసుకుంటూ కష్టపడుతుంది. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ నేతృత్వంలో, ఫేమస్ జైకా స్టంట్ టీమ్‌తో కలిసి రష్మిక ఈ శిక్షణ తీసుకుంటుంది. రష్మిక ట్రైనింగ్ తీసుకున్న ఫొటోలు షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. సాధారణంగా పెళ్ళైన హీరోయిన్స్, సినిమా, మీడియా పరిశ్రమలలో ఉన్నవాళ్లు తాళిబొట్టు, మెట్టెలు లాంటివి ధరించరు. కానీ రష్మిక ఇలా కాలి వేళ్ళకు మెట్లు ధరించి మరీ ఇంత కఠినమైన శిక్షణ తీసుకోవడం, పెళ్లి తర్వాత రష్మిక సినిమాల కోసం మరింత కష్టపడుతుంది అంటూ ఆమెని అభినందిస్తున్నారు.

రష్మిక మందన్న తన సినిమా కోసం ఎంతో కష్టపడుతోంది. పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ పట్ల ఆమెకున్న అంకిత భావం అభినందనీయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.