|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దిగ్భ్రాంతి! గొంతు కోల్పోయిన స్టార్ సింగర్ సుజాత.. రంగంలోకి రెహమాన్ సోదరి! ఏం జరిగిందంటే?

Published: 07-04-2026, 2:05 AM
దిగ్భ్రాంతి! గొంతు కోల్పోయిన స్టార్ సింగర్ సుజాత.. రంగంలోకి రెహమాన్ సోదరి! ఏం జరిగిందంటే?
  • ప్రముఖ సింగర్ సుజాత మోహన్ గొంతు సమస్యతో బాధపడుతున్నారు.
  • గత ఐదు సంవత్సరాలుగా పాటలు పాడలేకపోతున్నానని సుజాత వెల్లడించారు.
  • సుజాత త్వరగా కోలుకోవాలని ఏఆర్ రెహమాన్ సోదరి ఏఆర్ రెహానా ఆకాంక్షించారు.
  • వైద్యులు సహాయం చేయడానికి ముందుకు రావాలని రెహానా విజ్ఞప్తి చేశారు.

ప్రముఖ సింగర్ సుజాత మోహన్ గత కొంతకాలంగా గొంతు సమస్యతో బాధపడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె పాటలకు దూరం కావాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఏఆర్ రెహమాన్ సోదరి ఆమెకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు.

సుజాత మోహన్ గొంతు సమస్య

Tollywood:సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత అటు సెలబ్రిటీలు ఇటు సింగర్లు , మ్యూజిక్ డైరెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే తెర ముందు సంతోషంగా కనిపిస్తూ అందరిని ఎంటర్టైన్ చేసే ఈ సెలబ్రిటీలు తెరవెనుక తమ ఆరోగ్య విషయంలో ఎదుర్కొనే ఇబ్బందులు వర్ణనాతీతం అనే చెప్పాలి. అంతేకాదు ఈ అనారోగ్య సమస్యల వల్ల ఒక్కోసారి ఇండస్ట్రీ నుంచి దూరం కూడా అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక స్టార్ సింగర్ కూడా అలాంటి సమస్యతో బాధపడుతూ.. చేసేదేమి లేక ఇండస్ట్రీకి దూరం అయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సోదరి రంగంలోకి దిగి అసలు విషయంపై ఆరా తీయగా.. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మరి ఆ సింగర్ ఎవరు? అసలేం జరిగింది? ఆమె బాధ పడుతున్న సమస్య ఏమిటి ? అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఆమె ఎవరో కాదు ప్రముఖ స్టార్ సింగర్ సుజాత మోహన్(Sujatha Mohan). ఒకప్పుడు మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగుతోపాటు హిందీ, మరాఠీ వంటి భాషలలో అనేక పాటలు పాడి స్టార్ సింగర్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తన కెరియర్ లో దాదాపు 20 వేలకు పైగా పాటలు ఆలపించింది. అలాంటి ఈమె కొంతకాలంగా పాటలు పాడడమే మానేసింది. అయితే తాజాగా ఈ విషయాన్ని ఒక వేదికగా బయటపెట్టింది సుజాత మోహన్. ఆమె మాట్లాడుతూ..” నేను తీవ్రమైన గొంతు సమస్యతో బాధపడుతున్నాను. దీని కారణంగా మునుపటిలా పాడలేకపోతున్నాను. అందుకే గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ నేను ఒక్క పాట కూడా పాడలేదు” అంటూ ఆమె తన సమస్యను చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం విన్న ఆమె అభిమానులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. సమస్య నుంచి త్వరగా బయటపడి మళ్లీ తన స్వరాన్ని వినిపించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పాటలకు దూరం అయిన సింగర్

ఇకపోతే సుజాత మోహన్ ఆరోగ్య విషయాలపై ఆస్కార్ గ్రహీత సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సోదరి ఏ ఆర్ రెహానా స్పందిస్తూ.. “గతంలో నేను ఆమెకు కోరస్ గా పాడాను. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను. తన గొంతు సింగర్. తన గొంతు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న డాక్టర్లు ఎవరైనా సరే ముందుకు వచ్చి ఆమెకు సహాయం చేయండి” అంటూ కోరింది రెహానా.

ఇకపోతే సుజాత ఇలాంటి సమస్యతో బాధపడడం ఇదేమి మొదటిసారి కాదు.. 2010లో మాట్లాడేందుకు కూడా ఆమె ఇబ్బంది పడింది. మూడేళ్ల పాటు తన గొంతును తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఎంతో శ్రమించింది. చికిత్స చేయించుకొని మళ్ళీ పాటలు పాడింది. అయితే ఇప్పుడు మళ్లీ గత ఐదు సంవత్సరాలుగా గొంత సమస్యతో బాధపడుతున్నానని తెలిపి.. అభిమానులను, సినీ సెలబ్రిటీలను కూడా ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.

సహాయం కోసం రెహమాన్ సోదరి

ఇక సుజాత మోహన్ తెలుగులో ఆలపించిన పాటల విషయానికి వస్తే సమరసింహారెడ్డి సినిమాలో “అందాల ఆడబొమ్మ” , ఒక్కడు సినిమాలో “చెప్పవే చిరుగాలి”, అన్నమయ్య సినిమాలో “ఏలే ఏలే మరదలా “, “మూసిన ముత్యాలకే “ఇలా ఎన్నో మంచి పాటలు పాడి ప్రేక్షకులను, శ్రోతలను అలరించింది సుజాత మోహన్.

సుజాత మోహన్ త్వరగా కోలుకొని మళ్లీ పాటలు పాడాలని అభిమానులు కోరుకుంటున్నారు. వైద్యులు ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వస్తారని ఆశిద్దాం. ఆమె తిరిగి తన గానంతో అలరించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.