
ప్రతి వారం తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే టీఆర్పీ రేటింగ్స్ విడుదలవుతాయి. ఈ వారం స్టార్ మాలో ప్రసారమైన టాప్ 10 సీరియల్స్ జాబితా ఇక్కడ ఉంది. కార్తీక దీపం తన ఆధిపత్యాన్ని కొనసాగించిందా? చూద్దాం.
Key Points
కార్తీక దీపం మరోసారి టాప్‌లో నిలిచింది.
గుండెనిండా గుడిగంటలు అర్బన్‌లో కార్తీక దీపాన్ని మించింది.
ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు టాప్ 5లో ఉన్నాయి.
నువ్వుంటే నా జతగా, చిన్ని సీరియల్స్ కూడా మంచి రేటింగ్స్ సాధించాయి.
స్టార్ మా టాప్ 10 సీరియల్స్
తెలుగు సీరియల్స్ కి సంబంధించిన ప్రతి వారం టీఆర్‌పీ రేటింగ్ వస్తుంటుంది. మరి గత వారం(27th week trp rating) స్టార్ మాలో టాప్ లో ఉన్న సీరియల్స్ కి సంబంధించిన టాప్ 10 సీరియల్స్ లిస్ట్ వచ్చింది.
ఇందులో `కార్తీక దీపం`, `ఇల్లు ఇల్లాలు పిల్లలు`, `చిన్ని`, `ఇంటింటి రామాయణం`, `గుడి గంటలు`, `నువ్వుంటే నా జతగా`, `బ్రహ్మముడి` వంటి సీరియల్స్ టాప్‌లో ఉన్నాయి. వాటి స్థానాలు చూద్దాం.
స్టార్ మాలో గత వారం కూడా నెంబర్ వన్‌గా `కార్తీక దీపం` సీరియల్ నిలిచింది. ఇది చాలా కాలంగా టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే. స్టార్ మాలోనే కాదు, తెలుగు బుల్లితెరపై ఎక్కువ వ్యూస్ సాధిస్తున్న సీరియల్ ఇదే కావడం విశేషం.
నిరూపమ్, ప్రేమి విశ్వనాథ్ జంటగా నటించే ఈ సీరియల్ అర్బన్, రూరల్ కలిసి 14.32 టీఆర్‌పీ రేటింగ్ సాధించింది. అర్బన్‌లో 11.13 రేటింగ్‌ని సాధించింది.
స్టార్ మాలో రెండో స్థానంలో ఉన్న సీరియల్ `గుండెనిండా గుడిగంటలు`. అంతకు ముందు నాల్గో స్థానంలో ఉన్న ఈ సీరియల్ ఇప్పుడు రెండో స్థానంలోకి వచ్చింది.
కార్తీక దీపం ఆధిపత్యం
దీనికి రూరల్, అర్బన్ కలిపి 13.03 రేటింగ్ రాగా, అర్బన్‌లో 11.35 రేటింగ్ వచ్చింది. అర్బన్‌లో ఇది `కార్తీక దీపం`ని మించి వ్యూస్ రావడం విశేషం.
మూడో స్థానంలో `ఇంటింటి రామాయణం` సీరియల్ నిలిచింది. ఈ సీరియల్ రూరల్, అర్బన్ కలిపి 12.95 రేటింగ్‌ని, అర్బన్‌లో 10.31 రేటింగ్ సాధించింది. ఇది గత వారం కూడా ఇదే స్థానంలో ఉంది. పెద్దగా మార్పు లేదు.
నాల్గో స్థానంలో `ఇల్లు ఇల్లాలు పిల్లలు` సీరియల్ నిలిచింది. ప్రభాకర్, ఆమని నటించిన ఈ సీరియల్ గత వారం రెండో స్థానంలో ఉండగా, ఇప్పుడు రెండు స్థానాలు పడిపోయింది. ఇక ఇది రూరల్, అర్బన్ కలిపి 12.82 రేటింగ్, అర్బన్‌లో 10.11 రేటింగ్ సాధించింది.
ఐదో స్థానంలో `నువ్వుంటే నా జతగా` సీరియల్ నిలవడం విశేషం. ఇది గత వారం ఆరో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఒక్క స్థానం మెరుగుపడింది. ఇది అర్బన్, రూరల్ కలిపి 10.32 టీఆర్‌పీ రేటింగ్‌ని, అర్బన్‌లో 9.26 రేటింగ్‌ని సాధించింది.
ఆరో స్థానంలో `చిన్ని` సీరియల్ నిలించింది. ఇది ఒక్క స్థానం తగ్గింది. అర్బన్, రూరల్ కలిపి ఇది 8.26 రేటింగ్ ని, అర్బన్‌లో 6.70 రేటింగ్‌ని దక్కించుకుంది.
ఇతర సీరియల్స్ పోటీ
ఏదో స్థానంలో `బ్రహ్మముడి` సీరియల్ ఉంది. ఇది అర్బన్, రూరల్ కలిపి 7.03, అర్బన్‌లో 6.59 రేటింగ్‌ని పొందింది. ఇది గత వారం కూడా సేమ్ ఉంది.
ఎనిమిదో స్థానంలో `పలుకే బంగారమాయేనా` సీరియల్ ఉంది. ఇది అర్బన్, రూరల్ కలిపి 5.98 రేటింగ్‌ని, అర్బన్‌లో 5.66 రేటింగ్‌ని పొందింది.
తొమ్మిదో స్థానంలో `నిన్నుకోరి` సీరియల్ ఉంది. అర్బన్, రూరల్ కలిపి ఇది 5.89 రేటింగ్‌ని, అర్బన్‌లో 5.52 రేటింగ్‌ని దక్కించుకుంది. గత వారం ఇది కూడా సేమ్.
అలాగే పదో స్థానంలో `మామగారు` సీరియల్ నిలిచింది. దీనికి అర్బన్, రూరల్ కలిపి 5.67, అర్బన్‌లో 5.41 రేటింగ్‌ని పొందింది. గత వారం ఇది కూడా పదో స్థానంలోనే ఉంది.
వీటితోపాటు `పాపే మా జీవనజ్యోతి`, `మగువ ఓ మగువ`, `మల్లి`, `నిండు మనసులు`, `గీత ఎల్‌ఎల్‌బీ`, `భానుమతి`, `ఎల్లమ్మ` సీరియల్స్ మిగిలిన స్థానాల్లో ఉన్నాయి.
మొత్తంగా ఈ వారం స్టార్ మాలో ప్రసారమైన సీరియల్స్ అన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి సీరియల్‌కు ప్రత్యేకమైన ప్రేక్షకులు ఉన్నట్లు ఈ టీఆర్పీ రేటింగ్స్ స్పష్టం చేస్తున్నాయి.


