
80వ దశకంలో వెండితెరను ఏలిన అగ్రనటులందరూ చెన్నైలో ఘనంగా రీయూనియన్ పార్టీ చేసుకున్నారు. రాజ్‌కుమార్ సేతుపతి-శ్రీప్రియ ఆతిథ్యం ఇచ్చిన ఈ వేడుకలో చిరంజీవి, వెంకటేశ్ సహా 31 మంది తారలు చీతా థీమ్‌లో సందడి చేశారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Key Points
80వ దశకం స్టార్స్ రీయూనియన్ ఈ ఏడాది చెన్నైలో ఘనంగా జరిగింది.
రాజ్‌కుమార్ సేతుపతి-శ్రీప్రియ దంపతులు ఈ పార్టీకి ఆతిథ్యం ఇచ్చారు.
చిరంజీవి, వెంకటేశ్ సహా 31 మంది ప్రముఖ తారలు వేడుకలో పాల్గొన్నారు.
చీతా ప్రింట్స్ థీమ్‌తో సందడి చేసిన తారల ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
80స్ స్టార్స్ రీయూనియన్ ఎక్కడ జరిగింది?
స్టార్ హీరోలందరూ ఒక్కచోటకు చేరారు. 80వ దశకంలో వెండితెరపై సందడి చేసిన అగ్రనటులందరూ ఒకేచోట కలిసి ఎంతో ఘనంగా రీయూనియన్ ( The 80s Stars Reunion ) పార్టీ చేసుకున్నారు. 80’s రీయూనియన్ అంటూ ప్రతి ఏడాది సెలబ్రిటీలందరూ ఒకేచోటకు చేరి సంతోషంగా గడుపుతారన్న విషయం తెలిసిందే! ఈ ఏడాది అక్టోబర్ 4న చెన్నైలో ఘనంగా గెట్ టు గెదర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసారి కోలీవుడ్ జంట రాజ్‌కుమార్ సేతుపతి- శ్రీప్రియ తమ ఇంట్లోనే ఈ పార్టీని ఏర్పాటు చేశారు.
వేడుకలో సందడి చేసిన ప్రముఖులు ఎవరు?
31 మంది స్టార్స్ టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, వెంకటేశ్ ఈ పార్టీలో పాల్గొన్నారు. అలాగే నరేశ్, మీనా, శరత్‌కుమార్, నదియా, రాధ, సుహాసిని, రమ్యకృష్ణ, జయసుధ, సుమలత, ఖుష్బూ, లిస్సీ, శోభన, మేనక, సురేశ్, భాను చందర్, ప్రభు తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. దాదాపు 31 మంది నటీనటులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈసారి చిరుత థీమ్ ప్లాన్ చేసినట్లున్నారు. అందరూ చీతా ప్రింట్స్ ఉన్న డ్రెస్సులోనే మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
పార్టీ థీమ్, వైరల్ ఫోటోల విశేషాలు
ప్రతి ఏటా జరిగే ఈ 80స్ రీయూనియన్ ఈసారి కూడా ఎంతో విజయవంతంగా ముగిసింది. అగ్రతారలందరూ ఒకేచోట చేరి తమ అనుబంధాలను పంచుకోవడం అభిమానులకు ఆనందాన్ని పంచుతుంది. ఈ వేడుక ఫోటోలు ఇప్పటికీ వైరల్‌గా మారాయి.


