|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వీధిలోకొచ్చారు… థియేటర్‌కి వెళ్లారు… గోడ దూకారు!

Published: 08-06-2025, 3:17 PM
వీధిలోకొచ్చారు... థియేటర్‌కి వెళ్లారు... గోడ దూకారు!

బాలీవుడ్ స్టార్స్ ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ తమ సినిమాల కోసం చేసిన ఆసక్తికరమైన విషయాల గురించి ఈ కథనం వివరిస్తుంది. వీధిలో ప్రమోషన్, థియేటర్ లో రివ్యూ, గోడ దూకడం వంటి సంఘటనలు వారి నిబద్ధతను చూపుతాయి.

Key Points

1

ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' ప్రమోషన్ కోసం వడపావ్ తయారు చేశారు.

2

అక్షయ్ కుమార్ 'హౌస్ ఫుల్ 5' రివ్యూ కోసం థియేటర్ కి గుప్తంగా వెళ్లారు.

4

బాలీవుడ్ స్టార్స్ సినిమా కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసుకుందాం.

ఆమిర్ ఖాన్ వడపావ్ స్టైల్ ప్రమోషన్

ఒక హీరో తన సినిమా ప్రమోషన్‌ కోసం జనాల్లోకి వచ్చారు… ఇంకో హీరో విడుదలైన తన సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి థియేటర్‌కి వెళ్లారు… మరో నటుడు షూటింగ్‌కి లేట్‌ అవుతుందని గోడ దూకేశారు… వీరు ఏం చేసినా సినిమా కోసమే. బాలీవుడ్‌ నటులు ఆమిర్‌ ఖాన్, అక్షయ్‌ కుమార్, అనుపమ్‌ ఖేర్‌ తాజాగా ఇలా హాట్‌ టాపిక్‌ అయ్యారు.  ఇక ఆ విశేషాలు తెలుసుకుందాం.

వడపావ్‌ చేస్తూ… సినిమా ప్రమోషన్‌ కోసం ఏ అవతారం ఎత్తడానికైనా రెడీ అయిపోతారు ఆమిర్‌ ఖాన్‌. అందుకు ఓ ఉదాహరణ ‘3 ఇడియట్స్‌’ (2009) సినిమా. ఈ చిత్రం విడుదల సమయంలో పంజాబ్‌లో జరిగిన పెళ్లి వేడుకలకు ఫారినర్‌లా డ్రెస్‌ చేసుకుని హాజరయ్యారు ఆమిర్‌. ఆ తర్వాత అసలు గెటప్‌లోకి మారి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాజాగా తాను హీరోగా నటిం చిన ‘సితారే జమీన్‌ పర్‌’ ప్రచారం కోసం జనాల్లోకి వచ్చి, ‘వడపావ్‌’ తయారు చేశారు ఆమిర్‌. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఆమిర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించి, నటించిన ‘తారే జమీన్‌ పర్‌’ (2007)కి సీక్వెల్‌గా ‘సితారే జమీన్‌ పర్‌’ రూపొందింది. ఆర్‌ఎస్‌. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్‌ డ్రామా మూవీకి ఆమిర్‌ ఖాన్‌ ఓ నిర్మాత.

అక్షయ్ కుమార్ సీక్రెట్ థియేటర్ విజిట్

రివ్యూ కోసం మాస్క్‌తో! మామూలుగా సినిమా రిలీజ్‌ అయ్యాక ఎలా ఉందో తెలుసుకోవడానికి నిర్మాతలు, పంపిణీదారులు, సన్నిహితులను అడుగు తుంటారు స్టార్స్‌. అయితే ‘హౌస్‌ఫుల్‌ 5’ సినిమా ఎలా ఉందో స్వయంగా ప్రేక్షకులను అడిగి తెలుసుకోవాలనుకున్నారు ఈ చిత్రంలో ఓ లీడ్‌ రోల్‌ చేసిన అక్షయ్‌ కుమార్‌. ముఖానికి మాస్క్‌ తొడుక్కుని ముంబైలోని ఓ థియేటర్‌కి వెళ్లి, మైక్‌ పట్టుకుని ‘సినిమా ఎలా ఉంది’ అని థియేటర్‌ నుంచి బయటికొస్తున్న ప్రేక్షకులను అడిగారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. ‘హౌస్‌ఫుల్‌’ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ‘హౌస్‌ఫుల్‌ 5’లో సంజయ్‌ దత్, అభిషేక్‌ బచ్చన్, రితేష్‌ దేశ్‌ముఖ్‌ ఇతర లీడ్‌ రోల్స్‌ చేశారు. తరుణ్‌ మన్సుఖానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదలైంది.

ఏడు పదుల వయసులో గోడ దూకి… షూటింగ్‌కి ఆలస్యం అవుతోంది… డ్రైవర్‌ని కారు వేగం పెంచమన్నారు అనుపమ్‌ ఖేర్‌. కట్‌ చేస్తే… షూటింగ్‌ లొకేషన్‌కి చేరుకోలేదు. ఎందుకంటే కారు డెడ్‌ ఎండ్‌కి చేరుకుంది. రివర్స్‌ చేసుకుని, వెనక్కి వెళదామంటే వీలు పడలేదట. ఓ గోడ దూకితే అటు పక్క లొకేషన్‌ ఉంది. సాహసం చేసేద్దాం అని అనుపమ్, ఆయన టీమ్‌ నిర్ణయించుకున్నారు. నిచ్చెన తెచ్చారు. అనుపమ్‌ ఖేర్‌ ఆ నిచ్చెన ఎక్కి, గోడ దూకి లొకేషన్లోకి అడుగుపెట్టారు. ఇంతకీ ఈయన వయసు ఎంతో తెలుసా? 70. ఏడు పదుల వయసులో అనుపమ్‌ ఖేర్‌ ఇలా జోష్‌గా, జోరుగా గోడ దూకడం హాట్‌ టాపిక్‌ అయింది.

అనుపమ్ ఖేర్ యొక్క గోడ దూకిన సాహసం

ఆయన ఏ షూటింగ్‌లోపాల్గొనడానికి హైదరాబాద్‌ చేరుకున్నారంటే ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) కోసం. ఈ చిత్రంలో ఈ బాలీవుడ్‌ నటుడు కీలకపాత్ర చేస్తున్నారు. ఇక తాను ఇలా గోడ దూకిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వివరించి, ఆ వీడియోను షేర్‌ చేశారు అనుపమ్‌ ఖేర్‌. ‘‘నా 40 ఏళ్ల సినిమా ప్రయాణంలో పలు రకాలుగా షూటింగ్‌ లొకేషన్స్‌కి వెళ్లాను. కానీ, ఇలా వెళ్లడం చాలా ప్రత్యేకంగా, కామెడీగా అనిపించింది’’ అని రాసుకొచ్చారీ సీనియర్‌ నటుడు.

బాలీవుడ్ నటుల ఈ వినూత్న ప్రయత్నాలు వారి సినిమాలపై ఉన్న పట్టుదలను చాటుతున్నాయి. సినిమా ప్రేమ కోసం వారు చేసే ప్రయత్నాలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.