|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హారర్ కాని హారర్ మూవీ.. అసలు సులోచన ఎవరు? బాత్రూమ్ లో ఆడవాళ్లను చూసిన హీరో.. ఓటీటీ ట్రెండింగ్ లో కన్నడ థ్రిల్లర్ ‘సు ఫ్రమ్ సో’

Published: 13-09-2025, 9:45 AM
హారర్ కాని హారర్ మూవీ.. అసలు సులోచన ఎవరు? బాత్రూమ్ లో ఆడవాళ్లను చూసిన హీరో.. ఓటీటీ ట్రెండింగ్ లో కన్నడ థ్రిల్లర్ ‘సు ఫ్రమ్ సో’

కన్నడ హారర్ థ్రిల్లర్ ‘సు ఫ్రమ్ సో’ ఓటీటీలో అద్భుతమైన విజయం సాధిస్తోంది. కేవలం రూ.5.5 కోట్లతో నిర్మించబడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Key Points

1

కేవలం రూ.5.5 కోట్ల బడ్జెట్‌తో రూ.120 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన కన్నడ థ్రిల్లర్.

2

ఓటీటీలో జియోహాట్‌స్టార్‌లో ట్రెండింగ్‌లో ఉన్న 'సు ఫ్రమ్ సో' సినిమా.

4

సులోచన అనే మహిళా దెయ్యం, దానితో ముడిపడిన ఆకర్షణీయమైన కథాంశం.

‘సు ఫ్రమ్ సో’ ఓటీటీలో దూసుకుపోతోంది

ఓటీటీలో కన్నడ హారర్ థ్రిల్లర్ ‘సు ఫ్రమ్ సో’ (Su From So) అదరగొడుతోంది. ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను గొప్పగా ఎంగేజ్ చేస్తోంది. డిజిటల్ సినీ లవర్స్ ఆదరణను సొంతం చేసుకుంటోంది. బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ అదిరే వ్యూస్ తో సాగిపోతోంది.

కన్నడ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ ‘సు ఫ్రమ్ సో’ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జియోహాట్‌స్టార్‌ లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సు ఫ్రమ్ సో మూవీ సెప్టెంబర్ 9న ఓటీటీలోకి అడుగుపెట్టింది. కేవలం రూ.5.5 కోట్లతో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.120 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది.

బాత్రూమ్ సన్నివేశం మరియు దెయ్యం కథ

ఓటీటీలో సు ఫ్రమ్ సో జోరు కొనసాగుతోంది. జియోహాట్‌స్టార్‌ లో ఈ మూవీ టాప్-2లో ట్రెండ్ అవుతోంది. ఇండియాలో టాప్-1లో తెలుగు బిగ్ బాస్ షో ఉంది. సెకండ్ ప్లేస్ లో సు ఫ్రమ్ సో కొనసాగుతోంది. ఇది కన్నడతో పాటు తెలుగు, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీని చూసేందుకు ఆడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

సు ఫ్రమ్ సో సినిమాలో కీ రోల్ ప్లే చేసిన జేపీ తుమినాడ్ ఈ సినిమాకు డైరెక్టర్. రాజ్ బి శెట్టి కూడా కీలక పాత్ర పోషించాడు. ఓ గ్రామంలో అశోక్ అనే వ్యక్తి అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. అతనికి గ్రామంలోని ఓ అమ్మాయిపై ప్రేమ పుడుతుంది. మరోవైపు ఆ ఊర్లో రవన్న అనే వ్యక్తి అందరికీ పెద్ద దిక్కుగా ఉంటారు.

సులోచన రహస్యం ఏమిటి?

ఓ రోజు బాత్రూమ్ లో హీరోయిన్ స్నానం చేస్తుందేమోనని హీరో చూస్తాడు. కానీ వాళ్ల నానమ్మ అది చూసి గోల గోల చేస్తుంది. చూసిన వ్యక్తిని పట్టుకోవాలని గ్రామస్థులు ప్రయత్నిస్తారు. దీని నుంచి తప్పించుకోవడానికి దెయ్యం పట్టినట్లు అశోక్ నటిస్తాడు. గురువుగా రాజ్ బి శెట్టి ఎంట్రీ ఇస్తాడు.

గురువు ఎంట్రీతో సు ఫ్రమ్ సో మూవీ కామెడీ మరో లెవల్ కు చేరుతుంది. అప్పుడే సోమేశ్వరంలోని సులోచన అనే మహిళా దెయ్యం పట్టిందని అందరినీ నమ్మిస్తారు. ఆ సులోచన ఎవరు అనేది కనుక్కుంటారు. చనిపోయిన ఆవిడ కూతురు అశోక్ ఇంటికి వస్తుంది. ఆవిడకు సొంత బాబాయి నుంచే లైంగిక వేధింపులు ఎదురవుతాయి. మరి అశోక్ కు నిజంగానే సులోచన సోకిందా? చివరకు ఏమైంది? అనేది మిగిలిన కథ. క్లైమాక్స్ మాత్రం హార్ట్ టచింగ్ గా ఉంటుంది.

‘సు ఫ్రమ్ సో’ కథానాయకుడి అనుభవాలు, సులోచన రహస్యం, మరియు హృద్యమైన క్లైమాక్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ కన్నడ సినిమా ఓటీటీలో మంచి విజయాన్ని సాధిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.