|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో ‘సు ఫ్రమ్‌ సో’ విడుదల

Published: 06-09-2025, 1:17 AM
ఓటీటీలో 'సు ఫ్రమ్‌ సో' విడుదల

కన్నడలో భారీ విజయం సాధించిన ‘సు ఫ్రమ్ సో’ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. జియోహాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 9 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

Key Points

1

కన్నడ హిట్ సినిమా 'సు ఫ్రమ్ సో' ఓటీటీలోకి!

2

జియోహాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 9 నుండి స్ట్రీమింగ్

4

హారర్ కామెడీతో ప్రేక్షకులను అలరించిన 'సు ఫ్రమ్ సో'

‘సు ఫ్రమ్ సో’ ఓటీటీ ప్రయాణం

కన్నడ హిట్‌ సినిమా ‘సు ఫ్రమ్‌ సో'(Su From So Movie) ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. షనీల్‌ గౌతమ్‌, సంధ్య, రాజ్‌ బి.శెట్టి తదితరులు నటించిన హారర్‌ కామెడీ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని క్రియేట్‌ చేసింది. ఈ మూవీకి కథ, దర్శకత్వం జేపీ తుమినాడ్‌ అందించారు. తెలుగులో ఆగష్టు 8న మైత్రీ మూవీ మేకర్స్‌ వారు విడుదల చేశారు.

బాక్స్ ఆఫీస్ విజయం

కన్నడలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచిన  ‘సు ఫ్రమ్‌ సో’ చిత్రం.. తెలుగులో కూడా ప్రేక్షకులను మెప్పించింది. అయితే, ఈ చిత్రం జియోహాట్‌స్టార్‌ (JioHotstar)లో సెప్టెంబర్‌ 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈమేరకు ఆ ఓటీటీ సంస్థ అప్‌కమింగ్‌ సినిమా జాబితాలో ‘సు ఫ్రమ్‌ సో’ను చేర్చింది.  కన్నడతో పాటు తెలుగు, తమిళ్‌లో విడుదల కానుంది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైంది. అయితే, బాక్సాఫీస్‌ వద్ద ఏకం రూ.40కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

కథాంశం

కథేంటి? కర్ణాటక తీరప్రాంతంలోని ఓ పల్లెటూరు. అశోక్(జేపీ తుమినాడు) అనే కుర్రాడికి ఓ రోజు దెయ్యం పడుతుంది. దగ్గరలోని సోమేశ్వరం అనే ఊరికి చెందిన సులోచన అనే దెయ్యమే ఇతడికి ఆవహించిందని ఊరి ప్రజలందరూ అనుకుంటారు. దీంతో ఎలాగైనా సరే ఈ దెయ్యాన్ని వదిలించాలని ఊరి పెద్ద రవన్న (షనీల్ గౌతమ్).. ఓ స్వామిజీని(రాజ్ బి శెట్టి) తీసుకొస్తాడు. ఆత్మని వదిలించే క్రమంలో ఇది కాస్త ఊరి సమస్యగా మారుతుంది. ఇంతకీ ఆ యువకుడికి నిజంగానే దెయ్యం పట్టిందా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

చివరగా, ‘సు ఫ్రమ్ సో’ సినిమా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులకు మరోసారి అలరించేందుకు సిద్ధమవుతోంది. బాక్సాఫీస్ విజయం తర్వాత, ఇప్పుడు ఓటీటీలో దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.