|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Subhashree Rayaguru : బిగ్ బాస్ శుభశ్రీ ఏం చదువుకుందో తెలుసా? ప్రస్తుతానికి సినిమాల కోసం పక్కన పెట్టినా ఫ్యూచర్ లో అదే పని..

Published: 29-06-2025, 3:53 AM
Subhashree Rayaguru : బిగ్ బాస్ శుభశ్రీ ఏం చదువుకుందో తెలుసా? ప్రస్తుతానికి సినిమాల కోసం పక్కన పెట్టినా ఫ్యూచర్ లో అదే పని..

బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శుభశ్రీ రాయగురు గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. మిస్ ఇండియా నుండి సినిమాల వరకు ఆమె ప్రయాణం ఎలా ఉందో చూద్దాం.

Key Points

1

బిగ్ బాస్‌తో పేరు తెచ్చుకున్న శుభశ్రీ లా చదువుకుంది.

2

ఐఏఎస్ అవ్వాలని అనుకున్నా, మిస్ ఇండియాలో పాల్గొంది.

4

ప్రస్తుతం సినిమాల్లోనే ఫోకస్, భవిష్యత్తులో లాయర్‌గా పనిచేయాలని కోరుకుంటుంది.

శుభశ్రీ రాయగురు చదువు

Subhashree Rayaguru : బిగ్ బాస్ తో తెలుగులో బాగా ఫేమ్ తెచ్చుకుంది శుభశ్రీ రాయగురు. మోడలింగ్, నటిగా పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం పలు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ సినిమాల్లో ఛాన్సుల కోసం చూస్తుంది. ఇటీవలే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఓ తెలుగు నిర్మాతని నిశ్చితార్థం చేసుకుంది శుభశ్రీ.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది శుభశ్రీ. ఈ క్రమంలో తన చదువు గురించి తెలిపింది.

మిస్ ఇండియా నుండి బిగ్ బాస్ వరకు

శుభశ్రీ రాయగురు మాట్లాడుతూ.. మా నాన్న జడ్జ్. మా ఇంట్లో అందరూ బాగా చదువుకున్నవాళ్ళే. నేను లా చదివాను. ముంబైలో చదువుకున్నాను. అక్కడ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. మా ఇంట్లో వాళ్లకు చెపితే ఓకే అన్నారు. లా చదువుకుంటూనే మోడలింగ్ చేశాను. ఐఏఎస్ అవ్వాలి అనుకున్నాను కానీ మిస్ ఇండియాలో ఛాన్స్ రావడంతో పార్టిసిపేట్ చేశాను. ఫెమినా మిస్ ఇండియా ఒరిసా గెలుచుకున్నాను. మోడలింగ్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ కాల్ వచ్చింది. ఇప్పుడు సినిమాల మీదే ఫోకస్ పెట్టాను. భవిష్యత్తులో మాత్రం లాయర్ గానే చేస్తాను అని తెలిపింది.

సినిమాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలు

శుభశ్రీ రాయగురు తన చదువును, కెరీర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టిన ఆమె భవిష్యత్తులో తన లా చదువును ఉపయోగించుకోవాలని అనుకుంటోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.