|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sudheendra: కొత్త కారు కొన్న డ్యాన్సర్‌.. అంతలోనే అనంత లోకాలకు!

Published: 05-11-2025, 12:18 AM
Sudheendra: కొత్త కారు కొన్న డ్యాన్సర్‌.. అంతలోనే అనంత లోకాలకు!

ప్రముఖ రియాలిటీ షో డ్యాన్సర్‌ సుధీంద్ర బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కొత్త కారు కొన్న ఆనందంలో తమ్ముడికి చూపించేందుకు వెళ్తుండగా, ట్రక్కు ఢీకొని ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ వార్త విన్న అభిమానులు, టెలివిజన్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

Key Points

1

రియాలిటీ షో డ్యాన్సర్‌ సుధీంద్ర బెంగళూరు ప్రమాదంలో మృతి.

2

కొత్త కారు కొని తమ్ముడికి చూపించేందుకు వెళ్తుండగా విషాదం.

4

నిద్రమత్తులో ఉన్న ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

రోడ్డు ప్రమాద వివరాలు

కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. నగర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ రియాలిటీ షో డ్యాన్సర్‌ సుధీంద్ర(36) మృతిచెందారు. రోడ్డుపక్కన కారు ఆపి నిలిపి ఉండగా.. వేగంగా వచ్చిన ట్రక్కు సుధీంద్రను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్యాన్సర్ సుధీంద్రకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

నిద్రమత్తులో ట్రక్కు నడిపిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా.. కొత్త కారు కొన్న సుధీంద్ర తన తమ్ముడికి చూపించేందుకు వెళ్తండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే కారులో సమస్య రావడంతో నేలమంగళ తాలూకాలోని పెమ్మనహళ్లి సమీపంలో హైవే పక్కన ఆపినట్లు సమాచారం.  కాగా.. సుధీంద్ర పలు టెలివిజన్ రియాలిటీ షోలలో పాల్గొన్నారు.

సుధీంద్ర ఎవరు? నేపథ్యం ఏమిటి?

నిందితుడు అరెస్ట్, సీసీ కెమెరా దృశ్యాలు

కొత్త కారు కొన్న ఆనందం క్షణాల్లో విషాదంగా మారడం అందరినీ కలచివేసింది. ఈ దుర్ఘటనలో ఒక ప్రతిభావంతుడైన డ్యాన్సర్‌ను కోల్పోవడం తీరని లోటు. నిందితుడైన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.