
📌 Key Points
- సుడిగాలి సుధీర్‌ను ‘420’ అని కామెంట్ చేసిన విష్ణు ప్రియ, దిమ్మతిరిగిన సుధీర్!
- కావ్యతో కలిసి సుధీర్‌ను ఆటపట్టించిన నిహారిక, రాధిక శరత్ కుమార్!
- సుధీర్, విష్ణుప్రియ జోడీ బాగుందని నెటిజన్ల కామెంట్లు, వైరల్ అవుతున్న న్యూస్!
- యాంకర్ రష్మితో రొమాన్స్ గతం, ఇప్పుడు విష్ణుప్రియ, కావ్యతో పులిహోర ప్రయత్నాలు!
సుడిగాలి సుధీర్ గురించి ఒక సంచలన వార్త! జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సుధీర్, ఇప్పుడు హీరోయిన్ల చేతిలో ఆట వస్తువు అయ్యాడు. అసలు ఏం జరిగిందో తెలుసా?
సుధీర్‌ను ఆటాడుకున్న హీరోయిన్లు!
సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు. ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నాడు. హీరోగా రెండు మూడు సినిమాలతో మెప్పించాడు. తనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఫ్యాన్ బేస్ ఏర్పడింది. మహిళా ఆడియెన్స్ లోనూ ఆయనకు అభిమానులు ఉండటం విశేషం. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు టీవీ షోస్ చేస్తూ అలరిస్తున్నారు.
అందులో భాగంగా సుడిగాలి సుధీర్.. `ఆట` షోకి హోస్ట్ చేస్తున్నారు. జీ తెలుగులో ప్రసారం అవుతుంది. ఇందులో నిహారిక, రాధిక శరత్ కుమార్, కావ్య, విష్ణు ప్రియా వంటి వారు ఇందులో జడ్జ్ లుగా, టీమ్ లీడ్స్ గా ఉన్నారు. ఇందులో కావ్యతో ఆడుకుంటున్నాడు సుధీర్. అయితే ఆమెకి తెలుగు సరిగా రాదని ఆటపట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కావ్యనే సుధీర్‌ని ఆడుకుంటుంది. మోసగాడు అని వెల్లడించింది. కన్నడ భాష నేర్పిస్తూ, నువ్వు పెద్ద మోసగాడివి అని ఆమె చెప్పింది.
విష్ణుప్రియతో సుధీర్ పులిహోర?
ఈ సందర్భంగా నన్ను మోసం చేశారు కదా మీరు అని సుధీర్ అడగ్గా, నేను మోసం చేయడం లేదు, నువ్వు చేస్తున్నదే చెప్పాను అని వెల్లడించింది కావ్య. ఈ సందర్భంగా విష్ణు ప్రియకి నామీద ఎంత నమ్మకం ఉందో తెలుసా? అని సుధీర్ అడగ్గా, ఆమె లేదని చెప్పేసింది. `నువ్వు పెద్ద 420 గాడివి. నిన్ను ఎలా నమ్ముతారు` అని అందరి ముందు కామెంట్ చేసింది విష్ణు ప్రియ. దీంతో దెబ్బకి సుధీర్‌కి దిమ్మతిరిగిపోయింది. ఇందులో కావ్యతోపాటు విష్ణుప్రియ, నిహారిక అందరు కలిసి సుధీర్‌ని ఆడుకున్నారు.
ఇదిలా ఉంటే ఓ వైపు కావ్యతో, మరోవైపు విష్ణుప్రియతో సుధీర్ పులిహోర కలుపుతున్నాడు. కానీ కావ్య పెద్దగా ఛాన్స్ ఇవ్వడం లేదు. మరోవైపు నెటిజన్లు మాత్రం విష్ణుప్రియకి లింక్ చేస్తున్నారు. వీరిద్దరు జోడీ బాగుందని కామెంట్లు పెడుతున్నారు.
రష్మితో బ్రేకప్.. కారణమిదేనా?
ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్ ఒకప్పుడు యాంకర్ రష్మితో రొమాన్స్ చేశాడు. ఇద్దరి మధ్య బాగా కెమిస్ట్రీ పండింది. జబర్దస్త్ షోకి మంచి క్రేజ్‌ని, హైప్‌ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు. జబర్దస్త్ ని సుధీర్ వదిలేయడంతో ఇద్దరూ దూరమయ్యారు. ఆల్మోస్ట్ ఇద్దరూ విడిపోయినట్టే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆమెని కాదని, సుధీర్.. విష్ణప్రియ, కావ్యతో పులిహోర వేషాలు వేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే సుధీర్ ఏంచేసినా ఎంటర్‌టైమ్‌మెంట్ కోసమే అని చెప్పొచ్చు.
సుధీర్ ఎంటర్టైన్మెంట్ కోసమే ఇదంతా చేస్తున్నాడని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నారు. ఏది ఏమైనా, దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


