|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సుడిగాలి సుధీర్ షాకింగ్ ఎమోషన్స్! పెంపుడు కుక్క మరణం గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతం! వైరల్ వీడియో!

Published: 04-04-2026, 10:35 PM
సుడిగాలి సుధీర్ షాకింగ్ ఎమోషన్స్! పెంపుడు కుక్క మరణం గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతం! వైరల్ వీడియో!
  • సుధీర్ హోస్ట్‌గా ‘ఆట’ డ్యాన్స్ షోలో కుక్కపిల్ల పెర్ఫార్మెన్స్ చూసి పెంపుడు కుక్క ఆస్కార్‌ను గుర్తుచేసుకున్న సుధీర్!
  • కొన్నేళ్ల క్రితం ఒక ఫ్యాన్ బాక్స్‌లో చిన్న కుక్కపిల్లని ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోవడం గుర్తు చేసుకున్న సుధీర్.
  • మూడేళ్ల తర్వాత రేరెస్ట్ జ్వరంతో ఆస్కార్ మరణం, రష్మీతో కలిసి స్పెషల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిన సుధీర్.
  • ఆస్కార్ మరణంతో హార్ట్‌లో తెలియని పెయిన్, ఇప్పటికీ ఆస్కార్ ఫోటో ఇంట్లో ఉందని ఎమోషనల్ అయిన సుధీర్!

సుడిగాలి సుధీర్ గురించి ఒక ఎమోషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. తన పెంపుడు కుక్క మరణం గురించి సుధీర్ స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!

ఆట షోలో సుధీర్ ఎమోషనల్ కామెంట్స్!

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క టీవీ షోలు చేస్తూ బిజీగానే ఉన్నాడు. ప్రస్తుతం సుధీర్ ఆట అనే డ్యాన్స్ షోకి హోస్టింగ్ చేస్తున్నాడు. తాజాగా ఈ షోలో ఒక డ్యాన్సర్ కుక్కపిల్ల లాగా పెర్ఫార్మ్ చేస్తూ డ్యాన్స్ చేసింది. ఇది చూసి సుధీర్ తన పెంపుడు కుక్క మరణం గుర్తుచేసుకొని బాధపడ్డాడు.

కుక్కపిల్ల జ్ఞాపకాలతో సుధీర్ కన్నీళ్లు

సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ఒక ఫ్యాన్ కొన్నేళ్ల క్రితం మా ఇంటి ముందు ఒక బాక్స్ లో చిన్న కుక్క పిల్లని పెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు పెట్టారో తెలిసింది. చాలా క్యూట్ గా ఉండేది. మనం అలిగితే అదే మన మీదకు వచ్చేది. అల్లరి పనులు చేసి వేరే వాళ్ళను చూపించేది. ఒక మూడేళ్ళ తర్వాత మా ఆస్కార్ చనిపోయింది. తనకు రేరెస్ట్ జ్వరం వచ్చింది. పదకొండు రోజులు చాలా బాధపడి తన జ్వరం తాలూకు లక్షణాలు చూపించింది. దాంతో డాక్టర్స్ కి చుపించాము.

సుధీర్ పెంపుడు కుక్క ఆస్కార్ విషాద కథ!

రష్మీకి కూడా కాల్ చేసి ఒక స్పెషల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. ట్రీట్మెంట్ చేస్తూ రెండు రోజుల తర్వాత ఆస్కార్ చనిపోయింది అని డాక్టర్ చెప్పారు. ఆ రాత్రి అంతా ఆస్కార్ బాడీ ని మా ఇంట్లోనే పెట్టి అది ఇష్టం ఉన్నవాళ్ళందర్నీ పిలిచాను. మా తమ్ముడు అయితే దాని పక్కనే పడుకున్నాడు. ఇప్పటికి హార్ట్ లో తెలియని పెయిన్. ఆ తర్వాత మళ్ళీ ఇంకో డాగ్ పెంచుకోవాలన్నా భయం వచ్చేసింది. ఇప్పటికి మా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఆస్కార్ గాడి ఫోటో ఉంటుంది అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

సుధీర్ తన పెంపుడు కుక్క గురించి చెప్పిన విషయాలు అందరినీ కదిలించాయి. మరిన్ని సినిమా మరియు సెలబ్రిటీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.