|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సుధీర్ ఫోన్ సీక్రెట్స్ లీక్: చిరంజీవి నంబర్ ‘మై గాడ్’ అంట! రష్మీ విషయంలో మాత్రం…

Published: 12-04-2026, 7:05 AM
సుధీర్ ఫోన్ సీక్రెట్స్ లీక్: చిరంజీవి నంబర్ 'మై గాడ్' అంట! రష్మీ విషయంలో మాత్రం...
  • సుధీర్ ఫోన్ వాల్‌పేపర్ సీక్రెట్: రెండు ఫోన్లలోనూ తన ఫోటోనే వాల్‌పేపర్ అంట!
  • చిరంజీవి నంబర్‌ను ‘మై గాడ్’ అని సేవ్ చేసుకున్న సుధీర్: మెగాస్టార్‌పై అభిమానం నెక్స్ట్ లెవెల్!
  • రష్మీ పేరును రష్మీగానే సేవ్ చేసుకున్న సుధీర్: జబర్దస్త్ రోజుల్ని గుర్తు చేసుకున్న ఫాన్స్!
  • ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను పేర్లను కూడా యాజ్ ఇట్ ఈజ్ సేవ్ చేసుకున్న సుధీర్: ఫ్రెండ్షిప్ గోల్స్!

సుడిగాలి సుధీర్ గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. చిరంజీవి గారి నంబర్‌ను తన ఫోన్‌లో ఏమని సేవ్ చేసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు! ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

చిరంజీవి నంబర్‌ను ‘మై గాడ్’ అని ఎందుకు సేవ్ చేశాడు?

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ప్రస్తుతం బుల్లితెరపై హోస్ట్ గా రాణిస్తున్నాడు. అదే విధంగా హీరోగా కూడా అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నాడు. సుధీర్ కామెడీ టైమింగ్ అంటే చాలా మందికి ఇష్టం. అందుకే జబర్దస్త్ లో అంత పాపులర్ అయ్యాడు. సుధీర్ జబర్దస్త్ చేస్తున్నప్పుడు, ఇద్దరూ కలసి కొన్ని టీవీ షోలు చేస్తున్నప్పుడు వచ్చిన రూమర్స్ అన్నీ ఇన్నీ కావు.

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వలోనే వివాహం చేసుకోబోతున్నారు అని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆ రూమర్స్ పట్టించుకోకుండా ఇద్దరూ క్లోజ్ గా ఉంటూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ప్రస్తుతం ఇద్దరూ ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీ అయ్యారు.

రష్మీ పేరును అలా సేవ్ చేయడానికి కారణం ఏంటి?

తాను మెగాస్టార్ చిరంజీవి ఇన్సిపిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చినట్లు సుధీర్ తెలిపారు. చాలా సార్లు చిరంజీవిపై సుధీర్ తన అభిమానాన్ని చాటుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో మీ ఫోన్ లో ఎవరి వాల్ పేపర్ ఉంది అని అడిగారు. సుధీర్ బదులిస్తూ రెండు ఫోన్లు ఉన్నాయి. రెండింటిలో నా ఫోటోనే వాల్ పేపర్ గా ఉంటుంది అని తెలిపారు.

ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, రష్మీ వీళ్ళ పేర్లని ఏమని సేవ్ చేసుకున్నారు అని ప్రశ్నించగా..వాళ్ళ పేర్లని అలాగే సేవ్ చేసుకున్నట్లు తెలిపారు. రష్మీ పేరు రష్మీ అనే ఉంటుంది అని సుధీర్ అన్నారు.

సుధీర్ ఫోన్ వాల్‌పేపర్ వెనుక అసలు రహస్యం!

మీ ఫోన్ లో మెగాస్టార్ చిరంజీవి గారి నంబర్ ఉందా.. ఉంటే ఏమని సేవ్ చేసుకున్నారు అని అడగగా సుధీర్ బదులిచ్చాడు. చిరంజీవి గారి నంబర్ ఉంది. ఆయన నంబర్ ని ‘మై గాడ్’ అని సేవ్ చేసుకున్నట్లు సుధీర్ తెలిపారు.

సుధీర్ అభిమానం చూస్తుంటే ముచ్చటేస్తుంది కదూ! మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.