
📌 Key Points
- సుహాస్ హీరోగా గోపి అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హే భగవాన్’.
- సెన్సార్ బోర్డు సూచన మేరకు ‘హే భగవాన్’ టైటిల్‌ను ‘హే బలవంత్’గా మార్చారు.
- సినిమాలో నరేష్ ఒక ప్రత్యేకమైన బిజినెస్ చేస్తూ కనిపించనున్నారు.
- ఈ చిత్రాన్ని త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు.
సుహాస్ హీరోగా నటిస్తున్న ‘హే భగవాన్’ చిత్రం టైటిల్‌ను సెన్సార్ బోర్డు అభ్యంతరాల కారణంగా మార్చారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ మార్పు చోటు చేసుకోవడం గమనార్హం. ఇకపై ఈ సినిమా ‘హే బలవంత్’ పేరుతో విడుదల కానుంది.
సెన్సార్ కారణంగా టైటిల్ మార్పు
Hey Bhagawan: ఒక సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదల కావాలి అంటే సెన్సార్ బోర్డ్ అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో సెన్సార్ బోర్డ్ ఆంక్షలు కారణంగా దర్శక నిర్మాతలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల సెన్సార్ సమస్యల కారణంగా కొన్ని సినిమాలు విడుదల కూడా వాయిదా వేసుకుంటూ ఇప్పటికీ విడుదల కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా సినిమా టైటిల్ విషయంలో కూడా ఇటీవల సెన్సార్ బోర్డు దర్శక నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పాలి. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు టైటిల్ మార్పులు చేయటంతో దర్శక నిర్మాతలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇటీవల కపుల్ ఫ్రెండ్లీ సినిమా టైటిల్ వివాదంలో మార్పులు చేయాలి అంటూ సెన్సార్ సభ్యులు సూచించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో సినిమాకి ఏకంగా టైటిల్ మార్చేసిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రముఖ నటుడు సుహాస్(Suhas) హీరోగా గోపి అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “హే భగవాన్”(Hey Bhagawan). ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి.
‘హే బలవంత్’గా విడుదల కానున్న సినిమా
ఈ సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఈ సినిమా టైటిల్ ను మార్చి వేశారు. ఇప్పటివరకు హే భగవాన్ పేరుతో ఉన్న ఈ సినిమా సెన్సార్ కారణంగా హే బలవంత్(Hey Balwanth) అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియచేస్తూ అధికారక పోస్టర్లు కూడా విడుదల చేశారు. ఇలా చివరి నిమిషంలో ఈ సినిమా టైటిల్ మార్చడంతో చిత్ర నిర్మాతలు కొత్త టైటిల్ తో ప్రమోషన్లను మరింత వేగవంతం చేశారు.
నరేష్ చేస్తున్న బిజినెస్ ఏంటీ?
సినిమాలో నరేష్ పాత్ర ప్రత్యేకత
సుహాస్, శివాని నాగరం జంటగా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, కూడా నటించారు. నరేష్ పాత్ర ఈ సినిమాలో హైలెట్ గా ఉండబోతుందని ఇప్పటివరకు విడుదల చేసిన ప్రమోషనల్ అప్డేట్స్ చూస్తేనే తెలుస్తుంది. ఇందులో ఈయన ఒక బిజినెస్ చేస్తుంటాడు అయితే ఆ బిజినెస్ ఏంటి అనేది మాత్రం చాలా సస్పెన్స్ గా మారి సినిమాపై బాగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ సూపర్ సక్సెస్ అందుకుంటున్న సుహాస్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకోబోతున్నారో తెలియాల్సి ఉంది.
చివరి నిమిషంలో టైటిల్ మార్పు చిత్ర బృందానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, కొత్త టైటిల్‌తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

