|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Suhas – Keerthy Suresh : మహానటితో సుహాస్ ఓటీటీ మూవీ.. టైటిల్, ఫస్ట్ లుక్ అదిరిందిగా.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో?

Published: 16-06-2025, 1:24 AM
Suhas – Keerthy Suresh : మహానటితో సుహాస్ ఓటీటీ మూవీ.. టైటిల్, ఫస్ట్ లుక్ అదిరిందిగా.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో?

షార్ట్ ఫిలిమ్స్ నుండి వచ్చిన సుహాస్, ఇప్పుడు మహానటి కీర్తి సురేష్ తో కలిసి ఉప్పు కప్పురంబు అనే ఓటీటీ సినిమా చేశాడు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ ఇప్పుడు విడుదలయ్యాయి.

Key Points

1

సుహాస్ మరియు కీర్తి సురేష్ నటించిన "ఉప్పు కప్పురంబు" ఓటీటీ సినిమా

2

జులై 4 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

4

సినిమాలో బాబు మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నారు

ఉప్పు కప్పురంబు: రిలీజ్ డేట్ మరియు టైటిల్

Suhas – Keerthy Suresh : షార్ట్ ఫిలిమ్స్ నుంచి కెరీర్ మొదలుపెట్టిన సుహాస్ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా సుహాస్ మహానటి కీర్తి సురేష్ తో కలిసి ఓ ఓటీటీకి సినిమా చేసాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడకషన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్, టైటిల్ అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.

సుహాస్ మరియు కీర్తి సురేష్ కాంబినేషన్

సుహాస్ – కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న సినిమాకు ‘ఉప్పు కప్పురంబు’ అనే టైటిల్ పెట్టారు. రిలీజ్ చేసిన పోస్టర్ లో సుహాస్ వెంట కీర్తి సురేష్ పడుతుంది. ఈ పోస్టర్ చూస్తుంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సినిమాలా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ ఉప్పు కప్పురంబు సినిమా జులై 4 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు ప్రకటించారు. మరి సుహాస్ – కీర్తి సురేష్ కలిసి ఏ రేంజ్ లో ఉప్పు కప్పురంబుతో మెప్పిస్తారో చూడాలి. ఈ సినిమాలో సీనియర్ కమెడియన్ బాబు మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

సుహాస్ మరియు కీర్తి సురేష్ జంట కొత్త ఓటీటీ సినిమా ఉప్పు కప్పురంబుతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. జులై 4 నుండి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను ఆస్వాదించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.