|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OFFICIAL TEASER: ‘నేను బాహుబలిని కాదు..’ నవ్వులు తెప్పిస్తోన్న టీజర్!

Published: 29-08-2025, 3:16 AM
OFFICIAL TEASER: 'నేను బాహుబలిని కాదు..' నవ్వులు తెప్పిస్తోన్న టీజర్!

వరుణ్ ధావన్ మరియు జాన్వీ కపూర్ నటించిన ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. బాహుబలి గెటప్‌తో ప్రారంభమైన ఈ టీజర్, నవ్వులు పూయించే సంభాషణలతో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం లవ్ అండ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కింది.

Key Points

1

వరుణ్ ధావన్ మరియు జాన్వీ కపూర్ నటించిన 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' టీజర్ విడుదల

2

బాహుబలి గెటప్‌తో ప్రారంభమైన టీజర్ నవ్వులు పూయిస్తోంది

4

దసరా సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది

‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ టీజర్ హైలైట్స్

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది . ఆమె నటించిన పరమ్ సుందరి ఈ రోజే థియేటర్లలో రిలీజైంది . ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించింది . అంతే కాకుండా వరుణ్‌ ధావన్ ‌ తో కలిసి సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే చిత్రంలో జాన్వీకపూర్ నటిస్తోంది . తాజాగా ఈ మూవీ టీజర్ ‌ ను మేకర్స్ రిలీజ్ చేశారు . ఈ చిత్రంలో

బాహుబలి ఇన్స్పైర్డ్ కామెడీ

టీజర్ చూస్తే ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిస్తునట్లు తెలుస్తోంది . టీజర్ ‌ ప్రారంభంలో బాహుబలి గెటప్ ‌ తో ప్రారంభమైంది . బాహుబలి ప్రభాస్ ‌ గెటప్ ‌ లో వరుణ్ ధావన్ ‌ లుక్ ‌ అదిరిపోయింది . నేను అచ్చం బాహుబలిలానే ఉన్నానని వరుణ్ ధావన్ చెప్పడంతో .. నిన్ను చూస్తే రణ్ ‌ వీర్ సింగ్ ‌ ధోతిని.. ప్రభాస్ ‌ ధరించినట్లు ఉందంటూ చెప్పే డైలాగ్ తెగ నవ్వులు పూయిస్తోంది . ఈ టీజర్ ‌ చూస్తే ఫుల్ లవ్ అండ్ కామెడీ ఎంటర్ ‌ టైనర్ ‌ గా మెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది . ఈ చిత్రంలో రోహిత్ షరఫ్ , సన్యా మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు .

అక్టోబర్ 2 విడుదల తేదీ

కాగా .. ఈ చిత్రానికి శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహించారు . ఈ మూవీని దసరా సందర్భంగా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు . ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ ‌ బ్యానర్ ‌ లో కరణ్ జోహార్ , అదర్ పూనావాలా , అపూర్వ మెహతా , శశాంక్ ఖైతాన్ నిర్మిస్తున్నారు . ఈ సినిమాకు అజీమ్ దయాని సంగీతమందిస్తున్నారు .

సుమారుగా, ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్, కామెడీ, మరియు ఆసక్తికరమైన కథాంశం ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.