|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి ఆగస్ట్ 28 ఎపిసోడ్: మోసం చేసింది కావ్య కాదు యామిని- అపర్ణ ఉగ్రరూపం- చావు బతుకుల్లో రాజ్- ఆస్పత్రిలో ఫ్యామిలీ

Published: 27-08-2025, 10:45 PM
బ్రహ్మముడి ఆగస్ట్ 28 ఎపిసోడ్: మోసం చేసింది కావ్య కాదు యామిని- అపర్ణ ఉగ్రరూపం- చావు బతుకుల్లో రాజ్- ఆస్పత్రిలో ఫ్యామిలీ

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 28 ఎపిసోడ్‌లో కావ్య, యామినిల మధ్య మోసం ఆరోపణలు, అపర్ణ ఆగ్రహం, రాజ్ ఆరోగ్య పరిస్థితి కథను ఉత్కంఠభరితంగా మార్చాయి. ఈ ఎపిసోడ్‌లో చాలా ట్విస్టులు ఉన్నాయి.

Key Points

1

రాజ్, కావ్య మోసం గురించి ప్రశ్నిస్తాడు.

2

యామిని రాజ్‌ను కావ్య మోసం చేయలేదని చెబుతుంది.

4

రాజ్ ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలో చేరుతాడు.

మోసం వివాదం

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు, నువ్ మోసపోయావా లేదా నన్ను మోసం చేశావా. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పు. నిన్ను పెళ్లి చేసుకుంటాను. జీవితంలో ఏ ప్రశ్న నిన్ను అడగను. నీ మాటకు ఎదురుకూడా చెప్పను అని రాజ్ ఆవేశంగా అంటాడు.

ఇంతలో యామిని వచ్చి చెప్పు కళావతి అంటుంది. మా బావ లాంటి గొప్ప ప్రేమికుడు భవిష్యత్తులో కూడా ఎవరుండరు. ఎవరితోనో కడుపు తెచ్చుకుని మా బావను మోసం చేసిన కూడా నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు అంటే తనకు ఎంత గొప్ప మనుసు ఉండాలి. దేవుడే వరమిచ్చినట్లుగా మా బావ గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ నిజం ఎందుకు దాచిపెట్టావో మొత్తం చెప్పు కళావతి అని యామిని అంటుంది.

కావ్య సైలెంట్‌గా ఉంటే.. నిజం చెప్పలేవా. అంటే తప్పు చేశావనేగా అర్థం. మా బావను ఇలా చివరికి తాగుబోతును చేయాలనేగా నీ లక్ష్యం, ఎందుకు చేశావ్ ఇదంతా అని యామిని అంటుంది. దాంతో కావ్య వారిస్తుంది. తను ఇప్పటికీ నిజం చెప్పట్లేదు అంటే తను ఎలాంటిదో అర్థం కావట్లేదా. ఇలాంటి మోసగత్తే నీకు వద్దు. నేను నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను అని యామిని రాజ్ చేయి పట్టుకుని తీసుకెళ్తుంది.

కానీ, రాజ్ ఆగుతాడు. పెళ్లి చేసుకుంటా అన్నా కూడా నీ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పవా అని రాజ్ అంటాడు. యామిని మరింత ఆజ్యం పోస్తుంది. ఎవరైనా మోసం చేస్తే చెప్పేది. కానీ, ఆ మనిషి ఎవరో తెలియదనుకుంటాను. ఇలాంటి బజారు మనిషులు అని యామిని అంటే అపర్ణ లాగిపెట్టి కొడుతుంది. నువ్వేంత నీ బతుకెంత. పరాయి మగాడిని సొంతం చేసుకోవాలనుకునే నువ్వు చిల్లరదానివి అని అపర్ణ గట్టిగా ఇస్తుంది.

అపర్ణ ఆగ్రహం

అసలు నా ఇంట్లో అడుగుపెట్టే అర్హతే నీకు లేదు వెళ్లు అని యామినిని అంటుంది అపర్ణ. అమ్మ తను కాదు నేను అదే ప్రశ్న అడుగుతున్నా. నాకు సమాధానం చెప్పగలరా. ఏ తప్పు చేయనప్పుడు నిజం ఎందుకు చెప్పట్లేదు. ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. నేను నీ కొడుకులాంటివాన్ని అన్నావుగా. నీ కొడుకుకు అన్యాయం చేస్తావా. తప్పు చేస్తే క్షమించమనేది. అలా లేదంటే యామిని అన్నట్లు నిజంగానే ఎవరితోనే అని రాజ్ అంటుంటే అపర్ణ చెంపచెల్లుమనిపిస్తుంది.

అంతా అవాక్కవుతారు. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావ్. తిను నువ్ తాళి కట్టిన నీ భార్య అని అపర్ణ కుండ బద్దలు కొట్టేస్తుంది. అత్తయ్య అని కావ్య అంటే.. హేయ్.. ఆగు.. ఇప్పటికే చాలా ఆలస్యం చేశానే. అది నిన్ను నానా మాటలు అంటున్నా కొడుకుకు ఏం కాకుడదని ఇన్నిరోజులు ఆగాను. ఇప్పుడు నా కొడుకే దిగజారిపోయి మాట్లాడుతుంటే నిజం దాచి ఏం లాభం అని అపర్ణ అంటుంది.

ఏంట్రా అర్థం కావట్లేదా. నువ్ నా పేగు తెంచుకుని పుట్టిన కన్న కొడుకువి. ఈ కుటుంబం నీది. నువ్ పుట్టి పెరిగింది ఇక్కడే. అసలు నీ పేరు రామ్ కాదు. రాజ్, స్వరాజ్. నీ కళావతి పేరు కావ్య. కళావతి నెలతప్పడానికి కారణం నువ్వు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వు. శ్రీశైలానికి వెళ్లినప్పుడు యాక్సిడెంట్ అయిందిరా. నీ యాక్సిడెంట్‌ను అవకాశంగా మార్చుకుంది యామినిరా అని జరిగింది అంతా చెబుతుంది అపర్ణ.

రాజ్ ఆరోగ్యం

నువ్ కావ్య వెంట ఎందుకు పడ్డావ్, ఇంటి అడ్రస్ తెలియకున్నా ఎలా వచ్చావ్. యామిని చస్తానన్న ఎందుకు పట్టించుకోలేదు. అసలు నిన్ను మోసం చేసింది యామిని, దాని ఫ్యామిలీ అని జరిగినవన్నీ చెబుతుంది అపర్ణ. దాంతో గతంలో జరిగినవన్నీ రాజ్‌కు గుర్తుకు వస్తాయి. వెంటనే స్పృహ తప్పి పడిపోతాడు. అంబులెన్స్‌లో రాజ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు.

డాక్టర్ వచ్చి రాజ్‌కు క్రిటికల్‌గా ఉందని, పల్స్ రేట్ పడిపోయిందని, బీపీ బాగా తగ్గిపోయిందని, పేషంట్ స్పృహలోకి వస్తే ఏం చేయలేం అని చెప్పి వెళ్లిపోతాడు. అపర్ణ, కావ్య కుప్పకూలిపోతారు. ఇదంతా నా వల్లే జరిగింది, నా ఆవేశం వల్లే వాడికి ఈ పరిస్థితి వచ్చింది. పాపిష్టిదాన్ని అని అపర్ణ తనను తాను నిందించుకుంటుంది. ఇందిరాదేవి ఓదార్చుతుంది.

వాడి తల్లిగా నేను వాడి ప్రాణాలతో చెలగాటం ఆడాను అని అపర్ణ అంటుంది. కావ్య ఏడుస్తుంటే నన్ను క్షమించవే. నీకు ఎప్పుడు నేను అన్యాయమే చేస్తున్నా. తల్లిగా, అత్తగా రెండింట్లో ఓడిపోయాను. నా క్షాణికావేశంలో నేను చేసిన తప్పు ఈరోజు వాడిని చావు అంచుల వరకు తీసుకెళ్లింది అని బాధపడుతుంది అపర్ణ. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

రాజ్ ఆరోగ్యం విషమించడంతో కుటుంబం ఆస్పత్రిలో చేరిన తీవ్ర పరిస్థితితో ఎపిసోడ్ ముగుస్తుంది. కావ్య నిజం చెప్పడం, యామిని ప్రవర్తన, అపర్ణ ఆగ్రహం ఎపిసోడ్‌కు ఉత్కంఠను చేకూర్చాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.