|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్.. స్టార్ కపుల్స్ కాంబోలో మరో భారీ బడ్జెట్ చిత్రం!

Published: 07-08-2025, 12:41 PM
అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్.. స్టార్ కపుల్స్ కాంబోలో మరో భారీ బడ్జెట్ చిత్రం!

బాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ గుడ్ న్యూస్! బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలీయా భట్ జంటగా మరో భారీ బడ్జెట్ చిత్రం రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం…

Key Points

1

రణబీర్ కపూర్, అలీయా భట్ జంటగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సినిమా

2

‘లవ్ అండ్ వార్’ టైటిల్‌తో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనుంది

4

అభిమానులు సినిమా ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

రణబీర్, అలీయా కాంబినేషన్‌లో కొత్త సినిమా

బాలవుడ్ క్యూట్ కపుల్స్‌లో రణబీర్ కపూర్, అలీయా భట్ ఒకరు. ఇక రియల్ లైఫ్ లోనే కాకుండా.. రీల్ లైఫ్‌లో కూడా జంటగా నటించి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్నారు. ఈ క్యూట్ కపుల్స్ కాంబోలో వచ్చిన మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ బ్యానర్‌లపై కరణ్ జోహార్, రణబీర్ కపూర్, మారిజ్‌కే డిసౌజా, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 2022లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో రణబీర్ కపూర్, అలీయా భట్ కాంబోకు ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో మరో మూవీ వస్తే బాగుండు అని అనుకోని వారు కూడా లేరు.

అలాగే బ్రహ్మాస్త్ర -2 కూడా వస్తున్నట్లు వార్తలు రాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే.. రణబీర్ కపూర్, అలీయా కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట ప్రత్యక్షమైంది. రణబీర్ కపూర్, అలీయా భట్ జంటగా నటిస్తుండగా.. సంజయ్ లీలా భన్సాలీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది. ‘లవ్ అండ్ వార్’ టైటిల్‌తో తెరకెక్కేందుకు సిద్ధం అవుతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ బజ్ ఒకటి వచ్చింది. సెప్టెంబర్ 28న రణబీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక విందుగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారట మేకర్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లింక్

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం

‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ విడుదల

రణబీర్ కపూర్, అలీయా భట్ జంట నటనతో ‘లవ్ అండ్ వార్’ సినిమా భారీ అంచనాలను కలిగించింది. సెప్టెంబర్ 28న విడుదలయ్యే ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.