
📌 Key Points
- ఆది సాయి కుమార్ నటించిన ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందింది.
- ‘నా పేరు శంబాల’ టైటిల్ సాంగ్ ను గీతా మాధురి ఆలపించగా, కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ అందించారు.
- ఈ సినిమా బిజినెస్ విడుదలకు ముందే పూర్తయి, ఫాన్సీ రేటుకే అమ్ముడై రికార్డులు సృష్టించింది.
- డిసెంబర్ 25న ‘శంబాల’ సినిమా బ్లాక్ బస్టర్ కానుందని ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ‘నా పేరు శంబాల’ విడుదలైంది. గీతా మాధురి అద్భుతంగా ఆలపించిన ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను సృష్టించింది.
శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్ హైలైట్స్
వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ (Adi Sai Kumar)నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ (Shambhala: A Mystical World)మాత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేసింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యుగంధర్ ముని (Yugandhar Muni)దర్శకత్వం వహించారు. అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు నటించిన ఈ మూవీ బిజినెస్ ఇప్పటికే పూర్తి అయింది. ఫాన్సీ రేటుకే ఈ సినిమాని మేకర్స్ అమ్మేశారు. శంబాల అంటూ టైటిల్ ప్రకటించిన క్షణం నుంచి ఈ చిత్రం ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్, విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, మేకింగ్ వీడియో, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
డిఫరెంట్ ప్రమోషన్స్ తో శంబాల టీం జనాల్లోకి దూసుకుపోతోంది. డిసెంబర్ 25 న శoబాల బ్లాక్ బస్టర్ కానుందని అంతా ఫిక్స్ అయ్యారు. ఈక్రమంలో.. తాజాగా, మేకర్స్ ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘నా పేరు శంబాల’ అంటూ సాగే ఈ పాటను గీతా మాధురి ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్, శ్రీ చరణ్ పాకాల ఇచ్చిన బాణీ అందరినీ హత్తుకునేలా ఉంది. ఇక స్పెషల్ గా షూట్ చేసిన లిరికల్ వీడియో, అందులో గీతా మాధురి కనిపించిన తీరు అందరినీ కట్టిపడేస్తుంది.
‘నా పేరు శంబాల’ పాట ప్రత్యేకతలు
శంబాల టీమ్ ప్రమోషన్స్, అంచనాలు
‘నా పేరు శంబాల’ పాట విడుదల సినిమాపై అంచనాలను మరింత పెంచింది. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ విజయం సాధించాలని చిత్ర బృందం ఆశిస్తోంది. సంగీతం, కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చెప్పొచ్చు.


