|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూపర్ స్టార్ కృష్ణ తన కొడుకు కోసం చేసిన చివరి ప్రయత్నం ఏంటో తెలుసా?

Published: 11-10-2025, 8:53 AM
సూపర్ స్టార్ కృష్ణ తన కొడుకు కోసం చేసిన చివరి ప్రయత్నం ఏంటో తెలుసా?

సూపర్ స్టార్ కృష్ణ తన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబులని నటులుగా తీర్చిదిద్దారు. రమేష్ బాబు కెరీర్ లో వచ్చిన ఒడిదుడుకులను చూసి, ఆయన తిరిగి సినిమాల్లోకి రావాలని కృష్ణ ఎంతగా ప్రయత్నించారో దర్శకుడు ఎన్ శంకర్ వెల్లడించారు. ఆ ప్రయత్నం ఏంటో ఇప్పుడు చూద్దాం.

Key Points

1

సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో 350కి పైగా చిత్రాల్లో నటించారు.

2

రమేష్ బాబు తన నటనా కెరీర్‌లో డిజాస్టర్లతో విరక్తి చెంది సినిమాలు వదిలేశారు.

4

రమేష్ బాబు కెరీర్ కోసం కృష్ణ చేసిన చివరి ప్రయత్నం ఈ 'ఎన్‌కౌంటర్' చిత్రమే.

కృష్ణ కెరీర్, కుమారుల సినీ ప్రస్థానం

సూపర్ స్టార్ కృష్ణ 350 పైగా చిత్రాల్లో నటించారు. సినిమా కోసం సూపర్ స్టార్ కృష్ణ చేసినన్ని సాహసాలు ఇంకెవరూ చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో గొప్ప చిత్రాలని సూపర్ స్టార్ కృష్ణ అందించారు. కృష్ణ తన ఇద్దరు కొడుకులు రమేష్ బాబు, మహేష్ బాబులని నటులుగా తీర్చిదిద్దారు. మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు.

రమేష్ బాబు మూడేళ్ళ క్రితం అనారోగ్యంతో మరణించారు. రమేష్ బాబు 80, 90 దశకాల్లో హీరోగా రాణించారు. కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ రమేష్ బాబు నటించిన ప్రతి చిత్రం డిజాస్టర్ అవుతుండడంతో ఆయనకి సినిమా పట్ల విరక్తి కలిగింది. అందుకే సినిమాలు పూర్తిగా వదిలేశారు. దర్శకుడు ఎన్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ, రమేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రమేష్ బాబు సినిమాల పట్ల విరక్తి

ఎన్‌కౌంటర్ అనే టైటిల్ తో కృష్ణ గారికి కథ చెప్పడానికి వెళ్ళాను. కృష్ణ గారు 2 గంటల పాటు కథ విని చాలా బావుంది అన్నారు. నేను ఈ సినిమా చేస్తున్నాను. షూటింగ్ కి అంతా రెడీ చేసుకోండి అని చెప్పారు. ఈ మూవీలో వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, రాధిక, రోజా కీలక పాత్రల్లో నటించారు. కృష్ణ తనయుడు రమేష్ బాబు కూడా ఓ పాత్రలో నటించారు. ఆ పాత్ర కోసం ముందుగా వేరే నటుడిని అనుకున్నాం. కానీ కృష్ణ గారు తన కొడుకు రమేష్ బాబుని అడగమని చెప్పారు. రమేష్ ని ఒకసారి అడగండి. రమేష్ సినిమాలు వదిలేయాలని అనుకుంటున్నాడు.

ఇది రమేష్ కి లాస్ట్ మూవీ అయితే బావుంటుంది అని నా ఫీలింగ్. ఒక వేళ ఈ మూవీ సూపర్ హిట్ అయితే రమేష్ మళ్ళీ సినిమాలు తిరిగి ప్రారంభిస్తాడేమో. అప్పుడు ఇంకా హ్యాపీ అని కృష్ణ తనతో చెప్పినట్లు ఎన్ శంకర్ గుర్తు చేసుకున్నారు. కృష్ణ కోరిక మేరకు ఎన్ శంకర్ వెళ్లి.. రమేష్ బాబుని అడగడం, దానికి ఆయన అంగీకరించడం జరిగింది. రమేష్ బాబు ఎన్‌కౌంటర్ చిత్రంలో నటించడానికి ఒప్పుకోవడంతో కృష్ణ గారిలో పట్టలేని సంతోషం కనిపించింది. కృష్ణ గారు రమేష్ బాబు కెరీర్ కోసం చేసిన చివరి ప్రయత్నం ఇదే.

ఎన్‌కౌంటర్: కృష్ణ చివరి ప్రయత్నం

నటీనటులంతా ఎంపిక కావడంతో షూటింగ్ మొదలు పెట్టాం. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా ఫారెస్ట్ లోనే ఉంటుంది. దీని కోసం వికారాబాద్, హార్సిలీ హిల్స్, మదనపల్లె, భద్రాచలం, మోతుగూడెం లాంటి అటవీ ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరిపాం. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో, విప్లవాత్మక కథతో ఈ చిత్రం తెరకెక్కింది. అప్పట్లో 1996, 97లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉంది. మేము షూటింగ్ జరిపిన లొకేషన్స్ కూడా నక్సలైట్లు ఎక్కువగా తిరిగే ప్రాంతాలే.

దీనితో అప్పటి డీజీపీ స్థాయి వ్యక్తులు మా సినిమా షూటింగ్ పై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టారు. ఒకసారి షూటింగ్ కి వస్తున్న రమేష్ బాబు కారుని పోలీసులు ఆపేశారు. షూటింగ్ ఎక్కడ జరుగుతోంది, నటీనటులు ఎవరెవరు వచ్చారు అనే వివరాలు ప్రతి రోజూ ఇంటెలిజెన్స్ ద్వారా డీజీపీ టేబుల్ పైకి వెళ్ళేవి. ఈ విషయం సూపర్ స్టార్ కృష్ణ గారికి తెలిసింది. దీనితో కృష్ణ గారు నేరుగా అప్పటి సీఎం చంద్రబాబుని కలిశారు. ఇంటెలిజెన్స్, పోలీసులు తమ సినిమాపై నిఘా పెట్టారు అనే విషయాన్ని చంద్రబాబుకి తెలిపారు. దీనితో చంద్రబాబు.. అదేం పర్వాలేదు సర్.. మీరు హ్యాపీగా షూటింగ్ చేసుకోండి, అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని కృష్ణతో చెప్పినట్లు ఎన్ శంకర్ తెలిపారు. మొత్తంగా ఎన్‌కౌంటర్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని 1997లో రిలీజ్ అయింది. రమేష్ బాబు ఎన్‌కౌంటర్ మూవీ తర్వాత మళ్ళీ నటించలేదు.

రమేష్ బాబు కెరీర్ పట్ల కృష్ణకు ఎంత శ్రద్ధ ఉందో ఎన్‌కౌంటర్ చిత్ర సంఘటనలు వెల్లడిస్తున్నాయి. తన కొడుకు మళ్ళీ విజయవంతంగా తిరిగి రావాలని ఆశించిన కృష్ణ గారి ఆఖరి ప్రయత్నం ఇది. సినిమాపై ఆయన ప్రేమ అద్భుతం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.