
📌 Key Points
- మాల్దాలో ఎన్నికల విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను బందీలుగా ఉంచిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
- ఈ ఘటన ప్రీ ప్లాన్డ్‌గా జరిగిందని, దురుద్దేశపూరితమైందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
- అధికారులను బందీలుగా ఉంచబోతున్నారని తెలిసినా చర్యలు తీసుకోలేదని రాష్ట్ర అధికారులను కోర్టు ప్రశ్నించింది.
- ఓటరు జాబితా సవరణ విధుల్లో ఉన్న అధికారులను ఆందోళనకారులు సుమారు ఏడు గంటల పాటు బందీలుగా ఉంచారు.
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను బందీలుగా ఉంచిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని కోర్టు అభిప్రాయపడింది.
మాల్దా ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం
పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని మాల్దా జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను గంటల తరబడి బందీలుగా ఉంచిన ఘటనపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇది ప్రీ ప్లాన్డ్‌గా చేసిందేనని, దురుద్దేశపూరితమైదంటూ ధర్మాసనం ఫైర్ అయింది. విచారణ సందర్భంగా ఈ ఘటనపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) మాట్లాడుతూ.. ‘దురదృష్టవశాత్తూ మీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రాజకీయంగానే మాట్లాడుతున్నారు. అల్లరిమూకలు ఎవరో మాకు తెలియదని అనుకుంటున్నారా? అర్ధరాత్రి 2 గంటల వరకు నేను స్వయంగా పరిస్థితిని గమనిస్తూనే ఉన్నా’ అని బెంగాల్ అడ్వకేట్ జనరల్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. అధికారులను బందీలుగా ఉంచబోతున్నారనే సమాచారం ముందే ఉన్నప్పటికీ, వారిని సురక్షితంగా తరలించడంలో ఎందుకు విఫలమయ్యారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీ, డీజీపీలను కోర్టు ప్రశ్నించారు దేశంలోనే అత్యంత ధ్రువీకరణ చెందిన రాష్ట్రంగా బెంగాల్ మారుతోందని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
కాగా, ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను కలియాచక్-2 బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌లో ఆందోళనకారులు చుట్టుముట్టారు. సాయంత్రం 4 గంటల నుంచి సుమారు ఏడు గంటల పాటు వారిని బయటకు రానీయకుండా బందీలుగా ఉంచారు. వీరిలో ముగ్గురు మహిళా అధికారులు కూడా ఉన్నారు. ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపుపై అసంతృప్తితో ఉన్న నిరసనకారులు ఈ చర్యకు పాల్పడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు
అధికారుల నిర్బంధానికి కారణం ఇదే
మాల్దా ఘటన పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.


