|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

MSP చిక్కుల్లో కేంద్రం! సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు!!

Published: 13-04-2026, 12:05 PM
MSP చిక్కుల్లో కేంద్రం! సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు!!
  • కనీస మద్దతు ధర విధానంపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
  • సాగు ఖర్చు ఆధారంగా మద్దతు ధర నిర్ణయించాలని పిటిషన్‌లో కోరారు.
  • దిగుమతి సుంకం లేని వ్యవసాయ ఉత్పత్తుల వల్ల రైతులు నష్టపోతున్నారని పిటిషనర్ వాదన.
  • ఆహార భద్రతా చట్టం వల్ల చిరుధాన్యాల డిమాండ్ తగ్గిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కనీస మద్దతు ధర (MSP) పై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

MSP విధానంపై సుప్రీంకోర్టు విచారణ

దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, కనీస మద్దతు ధర (MSP) నిర్ణయించే విధానంపై సోమవారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. సాగు ఖర్చు ఆధారంగా మద్దతు ధరను శాస్త్రీయంగా నిర్ణయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం, దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తూ, భారతీయ రైతులు పండించిన పంటను కనీసం పెట్టుబడి ఖర్చుకు కూడా అమ్ముకోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని కోర్టుకు వివరించారు.

కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. “మీరు ఆర్థిక విధానాన్ని (Economic Policy) తిరిగి రాయమని మమ్మల్ని కోరుతున్నారు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రాష్ట్రాల వారీగా భూమి ధర, పెట్టుబడి ఖర్చులు మారుతుంటాయని, కాబట్టి అందరికీ ఒకే రకమైన విధానం అమలు చేయడం సవాలుతో కూడుకున్న పని అని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఈ అంశం దేశంలోని రైతులందరికీ సంబంధించింది కాబట్టి విచారణకు అంగీకరించింది.

రైతుల తరపున వాదనలు వినిపించిన ప్రశాంత్ భూషణ్

ఆహార భద్రతా చట్టం కింద గోధుమలు, బియ్యాన్ని దాదాపు ఉచితంగా పంపిణీ చేయడం వల్ల చిరుధాన్యాల (Millets) వంటి ఇతర పంటల డిమాండ్ తగ్గిపోతోందని పిటిషనర్ పేర్కొన్నారు. అలాగే, అమెరికా-భారత్ మధ్య జరిగిన కొత్త వాణిజ్య ఒప్పందం వల్ల దిగుమతి సుంకం లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు భారత్‌లోకి వస్తున్నాయని, ఇది స్థానిక రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని వివరించారు.

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని ‘ఆర్డర్లీ వ్యవస్థ’పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి.

ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు. Read More

సుప్రీంకోర్టు విచారణతో రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందా లేదా వేచి చూడాలి. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.