
📌 Key Points
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీం కోర్టు విచారణ ముగిసింది.
- స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున విచారణ అవసరం లేదని కోర్టు తెలిపింది.
- దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు.
- ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించింది.
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు విచారణ ముగించింది. స్పీకర్ నిర్ణయంతో ఏకీభవించిన కోర్టు, బీఆర్ఎస్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ కొట్టివేత
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీం కోర్టు విచారణను ముగించింది. బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. BRS పార్టీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ డిస్పోజ్ చేసింది.
ఈ కేసు విచారణ సమయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి.. దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికే విచారణ చేసి.. తగిన నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. పిటిషన్లను స్పీకర్ కార్యాలయం పరిష్కరించిందని ధర్మాసనానికి వెల్లడించారు.
అభిషేక్ మను సింఘ్వీ వాదనలతో జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. స్పీకర్ ఇప్పటికే ఈ వ్యవహారం తీసుకున్నందున.. ఇక మీద ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిన అవరసం లేదని ముగించింది. అంతేకాదు.. రెండు రోజుల్లో తీర్పు కాపీలను ఫిర్యాదుదారులకు అసెంబ్లీ స్పీకర్ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
స్పీకర్ నిర్ణయానికే సుప్రీంకోర్టు మద్దతు
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీలు మారినట్టుగా ఆధారాలు లేవని స్పష్టం చేశారు. వీరిద్దరిపై అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. మరోవైపు ఈ పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టులో గురువారం విచారణ జరగనుంది.
ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని తీర్పులో స్పీకర్ వెల్లడించారు. సుప్రీంకోర్టులో విచారణకు ముందే స్పీకర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు.
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ఊరట
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో తెల్లం వెంకట్‌రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, అరికెపూడి గాంధీ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఉన్నారు. తాజాగా సుప్రీం కోర్టు కూడా స్పీకర్ నిర్ణయం తీసుకున్నందున విచారణ చేయాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలినట్టైంది.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ నేతలు పిటిషన్‌ను దాఖలు చేశారు. స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కొన్ని రోజుల కిందట విచారించింది. స్పీకర్ మీద సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేం తీసుకోవాలా ? అని తెలంగాణ స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.


