
స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియా పృథ్వీరాజ్ బాలల దినోత్సవం నాడు తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన తండ్రి దూరమై నాలుగేళ్లయ్యిందని, ఆ బాధ వెంటాడుతోందని, మాటల్లో చెప్పలేనంతగా మిస్ అవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.
Key Points
బాలల దినోత్సవం నాడు తండ్రిని తలచుకుంటూ సుప్రియా పృథ్వీరాజ్ ఎమోషనల్ పోస్ట్.
తన తండ్రి దూరమై నాలుగేళ్లయ్యిందని, ఆ బాధ వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
చిల్డ్రన్స్ డే రోజే శాశ్వతంగా దూరం కావడం మాటల్లో చెప్పలేనంత బాధాకరం అని తెలిపింది.
పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియ, ప్రముఖ నిర్మాతగా పలు చిత్రాలు నిర్మిస్తున్నారు.
సుప్రియా భావోద్వేగ పోస్ట్
నేడు (నవంబర్ 14న) బాలల దినోత్సవం. ఈ రోజును ఇష్టపడనివారు ఎవరుంటారు? అయితే ఎంతో ఇష్టమైన ఈరోజు తన జీవితంలో బాధాకరమైన రోజుగా మారిపోయిందంటోంది స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య, నిర్మాత సుప్రియ మీనన్ ( Supriya Menon Prithviraj ). బాలల దినోత్సవం నాడే తండ్రి తనను వదిలేసి వెళ్లిపోయాడంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
శాశ్వతంగా దూరమై 4 ఏళ్లు నాన్న, నువ్వు మాకు దూరమై నాలుగేళ్లవుతోంది. నువ్వు వెళ్లిపోయాక ఎన్నోసార్లు జీవితం ఒక శూన్యంలా అనిపించింది. సంతోషకర క్షణాల్లో కూడా తెలియని బాధ మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. నువ్వు ఇంకొంతకాలం మాతో ఉంటే బాగుండని చాలాసార్లు అనిపించింది. నీతో కలిసి నేను ఎన్నో పనులు చేయాలనుకున్నాను. కానీ, అంత సమయం లేకపోయింది.
చిల్డ్రన్స్ డే నాడే తండ్రి దూరం
మాటల్లో చెప్పలేను అన్నిటికంటే బాధాకరమైన విషయమేంటో తెలుసా? చిల్డ్రన్స్ డే రోజే నువ్వు నాకు శాశ్వతంగా దూరమయ్యావు. నిన్ను ప్రతిరోజు మిస్ అవుతున్నాను డాడీ.. మిస్‌యూ సో మచ్. నిన్ను ఎంత మిస్ అవుతున్నానో మాటల్లో చెప్పలేను అంటూ తండ్రితో కలిసి దిగిన పలు ఫోటోలను షేర్ చేసింది. సుప్రియ తండ్రి, నిర్మాత, బిజినెస్‌మెన్ విజయకుమార్ 2021లో క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశాడు.
మలయాళ స్టార్‌తో పెళ్లి సుప్రియ ఒక జర్నలిస్టు. ఈమె.. హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ ( Prithviraj Sukumaran )ను 2011లో పెళ్లి చేసుకోగా వీరికి ఓ కూతురు సంతానం. పృథ్వీరాజ్ భార్య సుప్రియతో కలిసి పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ బ్యానర్‌లో 9, డ్రైవింగ్ లైసెన్స్, జనగణమన, కడువ, గురువాయూర్ అంబలనడయిల్ సినిమాలు నిర్మించారు.
పృథ్వీరాజ్-సుప్రియ దంపతుల ప్రొడక్షన్
సినిమా కేజీఎఫ్:2, సలార్ సినిమాలను మలయాళంలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ద గోట్ లైఫ్ (ఆడు జీవితం), సలార్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న పృథ్వీరాజ్ ప్రస్తుతం #SSMB29 (మహేశ్‌బాబు -రాజమౌళి కాంబినేషన్) మూవీలో కీలక పాత్ర చేస్తున్నాడు.
తండ్రి మరణం ఆమె జీవితంలో తీరని శూన్యాన్ని మిగిల్చిందని, సంతోష క్షణాల్లో కూడా ఆయన గుర్తుకు వస్తారని సుప్రియ తెలిపింది. బాలల దినోత్సవం నాడే తండ్రి దూరం కావడం ఆమెను తీవ్రంగా కలచివేసింది.


