|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ గురించి షాకింగ్ నిజం బయటపెట్టిన సురేఖ కొణిదెల! ఇది కదా అసలు సీక్రెట్!!

Published: 21-02-2026, 5:05 AM
రామ్ చరణ్ గురించి షాకింగ్ నిజం బయటపెట్టిన సురేఖ కొణిదెల! ఇది కదా అసలు సీక్రెట్!!
  • రామ్ చరణ్ చిన్నప్పటి నుంచి సైలెంట్, సాఫ్ట్ స్వభావం కలవాడు అని సురేఖ వెల్లడి.
  • టీనేజ్ లో సీక్రెట్ గా ‘కిల్లి’ తినేవాడని తల్లి సురేఖ కొణిదెల టాప్ సీక్రెట్ రివీల్.
  • ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలో నటిస్తున్నాడు; డైరెక్టర్ బుచ్చిబాబు సన.
  • ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రెండు ప్లాప్ సినిమాలు ఫేస్ చేసిన రామ్ చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఒక షాకింగ్ సీక్రెట్ బయటపడింది. రామ్ చరణ్ చిన్నప్పటి అలవాట్ల గురించి ఆయన తల్లి సురేఖ కొణిదెల స్వయంగా వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

చిన్ననాటి రామ్ చరణ్ ఎలా ఉండేవారు?

మగధీర సినిమాతో.. పాన్ ఇండియాకు పరిచయం అయిన రామ్ చరణ్… ట్రిపుల్ ఆర్ సినిమాతో.. పాన్ ఇండియా ఫేవరెట్ గా మారిపోయాడు. ఈసినిమాతో ఆస్కార్ సాధించి.. వరల్డ్ సినిమాను ఆకర్శించాడు. టైటానిక్, అవతార్ లాంటి అద్భుతాలు సృష్టించిన జేమ్స్ కామరాన్ లాంటి దర్శకుడితోనే శభాష్ అనిపించుకున్నాడు రామ్ చరణ్.

పాన్ వరల్డ్ ఇమేజ్ ను సాధించిన ఈ హీరో.. ట్రిపుల్ ఆర్ తరువాత రెండు ప్లాప్ సినిమాలను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆచార్యతో పాటు, గేమ్ ఛేంజర్ సినిమాతో డిజాస్టర్స్ ఫేస్ చేశాడు రామ్ చరణ్.

రామ్ చరణ్ గతంలో ఎలా ఉన్నా.. రంగస్థలం సినిమా అప్పటి నుంచి చాలా మారిపోయాడు. సినిమాలే కాదు.. ఆయనప్రవర్తన కూడా ఎంతో మారింది. యాక్టింగ్ విషయంలో కూడా తన మార్క్ నటనను మార్చుకుని.. అద్భుతాలు చేయడం స్టార్ట్ చేశాడు.

టీనేజ్ లో చరణ్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా?

రంగస్థలం సినిమాలో డీ గ్లామర్ రోల్ తో అలరించిన స్టార్ హీరో.. ఆతరువాత ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ను సైతం డామినేట్ చేయగలిగే యాక్టింగ్ ను చూపించాడు చరణ్. అంతే కాదు పర్సనల్ గా కూడా అభిమానులతో కనెక్ట్ అవుతూ.. కూల్ గా కామ్ గా, ప్రతీ ఒక్కరిని ప్రేమగా పలకరిస్తూ.. చరణ్ ఇండస్ట్రీలో.. అభిమానుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు.

రామ్ చరణ్ చిన్ననాటి సంగతుల గురించి ఆయన తల్లి సురేఖ కొణిదెల గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిన్నప్పటి నుంచే చరణ్ చాలా సైలెంట్, కామ్ గోయింగ్, సాఫ్ట్ స్వభావం కలిగిన వాడని ఆమె తెలిపారు. ఇతర పిల్లలలా ఎక్కువగా అల్లరి చేయడం, ఆటపాటల్లో మునిగిపోవడం అతని స్వభావం కాదని చెప్పారు. ఇంట్లోనూ, బయటా కూడా ప్రశాంతంగా ఉండేవాడని సురేఖ గుర్తుచేశారు.

అయితే టీనేజ్ దశలోకి వచ్చిన తర్వాత చరణ్‌లో కొంత చలాకీతనం పెరిగిందని సురేఖ వెల్లడించారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ అతని వ్యక్తిత్వంలో మార్పులు వచ్చాయని, కానీ చిన్నప్పటి నుంచి ఉన్న శాంత స్వభావం మాత్రం కొనసాగిందని వివరించారు.

‘పెద్ది’ మూవీలో రామ్ చరణ్ ఎలా ఉండబోతున్నాడు?

ఇక చరణ్‌కు ‘కిల్లీ’ అంటే ఎంతో ఇష్టమని సురేఖ సరదాగా గుర్తుచేసుకున్నారు. చిన్నపిల్లలు అలాంటి పదార్థాలు తినకూడదని ఇంట్లో చెప్పినా, పక్కకు వెళ్లి.. సందులో నిలబడి.. సైలెంట్‌గా కిల్లీ తినేవాడని నవ్వుతూ చెప్పారు. ఈ విషయం కుటుంబంలో ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ మాట్లాడుకుంటూ.. నవ్వుకుంటామని ఆమె పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

ఏప్రిల్ 30న ఈమూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పెద్ది సినిమా నుంచి రిలీజ్ అయిన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న ప్రయత్నంలో ఉన్నాడు చరణ్. ఇక ఈమూవీ తరువాత సుకుమార్ తో మరో సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్.

రామ్ చరణ్ చిన్ననాటి విషయాల గురించి తెలుసుకున్నారు కదా. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మెగా అభిమానులకు ఇది నిజంగా పండగే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.