
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తికాకపోవడం, ఆర్థిక సమస్యలు దీనికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ వాయిదాతో ఆందోళన చెందుతున్నారు.
Key Points
హరిహర వీరమల్లు సినిమా విడుదల వాయిదా
వీఎఫ్‌ఎక్స్ పూర్తి కాని కారణంగా ఆలస్యం
డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేస్తున్నారని సమాచారం
వీఎఫ్‌ఎక్స్ పూర్తికాని కారణంగా ఆలస్యం?
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభిమానుల బ్యాడ్ న్యూస్. పవన్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడింది. ఈనెల 12న విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్‌పోన్ చేశారని వార్తలొస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం వీఎఫ్‌ఎక్స్‌తో పాటు ఆర్థికపరమైన సమస్యల వల్లేనని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే పలుసార్లు వాయిదా పడడంతో డిస్ట్రిబ్యూటర్స్ వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. అందువల్లే హరిహర వీరమల్లు వాయిదా తప్పేలా కనిపించడం లేదు.
ఆర్థిక సమస్యలు సినిమా విడుదలపై ప్రభావం?
అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లోనూ ఎలాంటి బజ్ లేకపోవడంతో భారీ నష్టాలు వచ్చే అవకాశముందని పంపిణీదారులు కూడా వెనకాడుతున్నట్లు సమాచారం. ప్రధాన ఆర్థిక పరమైన సమస్యలతోనే ఈ సినిమాను వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఆలస్యం కావడానికి మరో ప్రధాన కారణం వీఎఫ్‌ఎక్స్. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న వీఎఫ్‌ఎక్స్‌తో పాటు స్టూడియోలకు చెల్లింపులు చేసే గడువు కూడా ముగిసిపోయినట్లు తెలుస్తోంది. దీనివల్ల పోస్ట్-ప్రొడక్షన్‌లో మరింత జాప్యం జరుగుతోందని ఓ నివేదిక పేర్కొంది. ప్రస్తుతానికి ఒక వారం వాయిదా మాత్రమే ఉండొచ్చని కొందరు భావిస్తున్నప్పటికీ.. దాదాపు నెల రోజులు ముందుకు వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
డిస్ట్రిబ్యూటర్ల వెనకడుగు వల్లే వాయిదా?
ఇప్పటికే డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్.. జూన్ 12 వరకే డీల్‌కు అనుమతించినట్లు సమాచారం. ఆ తేదీ గడువు దాటితే ఒప్పందం డీల్ విలువలో రూ. 20 కోట్ల తగ్గింపు కోరినట్లు సమాచారం. ఇప్పటికే వాయిదాపై పలు ఊహగానాలు వస్తున్నప్పటికీ.. ఆలస్యం గురించి నిర్మాతల నుంచి ఇప్పటి వరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం కుదరపోతే జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో రిలీజ్ చేస్తారని సమాచారం.
చివరి నిమిషంలో వచ్చిన ఈ వాయిదా పవన్ కళ్యాణ్ అభిమానులను నిరాశపరిచింది. వీఎఫ్ఎక్స్ పూర్తి చేసి, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుని త్వరలోనే సినిమా విడుదల చేస్తారని ఆశిద్దాం.


