|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హర్రర్‌ మూవీతో వస్తున్న సురేఖ వాణి కూతురు, ఆ ముగ్గురితో కలిసి రచ్చ

Published: 17-05-2025, 8:28 PM
హర్రర్‌ మూవీతో వస్తున్న సురేఖ వాణి కూతురు, ఆ ముగ్గురితో కలిసి రచ్చ

ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత తొలి హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ కంఠమనేని, ఎస్తేర్, ధన్య బాలకృష్ణతో కలిసి ఆమె నటిస్తున్న ఈ చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’.

Key Points

1

సురేఖ వాణి కూతురు సుప్రిత హర్రర్ మూవీలో నటిస్తుంది.

2

శివ కంఠమనేని, ఎస్తేర్, ధన్య బాలకృష్ణ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

4

మధ్యప్రదేశ్ లోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ జరిగింది.

సుప్రిత హర్రర్ మూవీలో

సీనియర్‌ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత హీరోయిన్‌గా బిజీ అవుతుంది. మొన్న బెట్టింగ్‌ యాప్‌లు ప్రమోట్‌ చేసి తప్పు చేశానని సారీ చెప్పి వార్తల్లో నిలిచింది. అంతకు ముందు అమ్మ సురేఖ వాణితో కలిసి విదేశాల్లో రచ్చ చేసింది. ఆయా ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని అలరించింది. అయితే ఇప్పుడు సినిమా కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే అమర్‌ దీప్‌తో కలిసి ఓ మూవీలో నటిస్తుంది. దీంతోపాటు ఇప్పుడు మరో సినిమా చేస్తుంది.

శివ కంఠమనేని హీరోగా ఎస్తేర్‌, ధన్య బాలకృష్ణలతో కలిసి సుప్రిత ఓ హర్రర్‌ మూవీ చేస్తుంది. ప్రస్తుతం హర్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. మంచి క‌థాబ‌లంతో తెర‌కెక్కిన హర్రర్‌, థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు థియేట‌ర్స్‌లోనే కాకుండా ఓటీటీల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఆ కోవ‌లోనే ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ క‌థ, క‌థ‌నంతో తెర‌కెక్కుతోన్న హార‌ర్ థ్రిల్ల‌ర్ `అమ‌రావ‌తికి ఆహ్వానం`.

ఈ మూవీలో సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీల‌క‌పాత్ర‌లు పోషించారు. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘అమరావతికి ఆహ్వానం’ చిత్రం

ఇటీవ‌ల‌ విడుద‌లైన టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తాజాగా మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. మ‌ధ్య ప్రదేశ్ చింద్వార జిల్లాలోని తామ్య హిల్స్‌, పాతాళ్ కోట్‌, బిజోరి, చిమ్‌తీపూర్ వంటి ప‌లు అంద‌మైన లొకేష‌న్స్‌లో దాదాపు 20 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రిపారు.

ఈ సంద‌ర్భంగా హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ, `అమ‌రావ‌తికి ఆహ్వానం` టైటిల్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌జెంట్ ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకుని ద‌ర్శ‌కుడు జీవీకే ఒక మంచి హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

టెక్నిక‌ల్‌గా కూడా ఈ సినిమా చాలా బాగుంటుంది. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లోని ప‌లు లొకేష‌న్స్‌లో షూటింగ్ పూర్తి అయింది. తాజాగా మ‌ధ్య ప్ర‌దేశ్‌లో చిత్రీక‌ర‌ణ పూర్తి చేశాం. ఔట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది` అని అన్నారు

మధ్యప్రదేశ్ షూటింగ్

ద‌ర్శ‌కుడు జివికె మాట్లాడుతూ – స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాశంతో వ‌స్తోన్న చిత్రం అమ‌రావ‌తికి ఆహ్వానం. వీ ఎఫ్ ఎక్స్‌కి కూడా మంచి ప్రాధాన్య‌త ఉంటుంది. జె ప్రభాక‌ర్ రెడ్డి గారి విజువ‌ల్స్, హ‌నుమాన్ ఫేమ్ సాయిబాబు త‌లారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్ల‌స్ అవుతాయి. పద్మ‌నాబ్ బ‌ర‌ద్వాజ్ గారి సంగీతం, బాక్ గ్రౌండ్ స్కోర్ హార‌ర్ ఎలిమెంట్ ని క్యారీ చేస్తుంది` అని చెప్పారు.

చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ , మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్‌లో మాకు పూర్తి స‌హ‌కారం అందించిన శ్రీ శీలంధ‌ర్ (IAS)గారికి, శ్రీ అజ‌య్ పాండే (SP) గారికి, శ్రీ ఎజి కుమార్ (DISTRICT CEO) గారికి మా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు అన్నారు.

సుప్రిత తన నటనతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ‘అమరావతికి ఆహ్వానం’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.