|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకి అన్యాయమా? సుప్రీత సంచలన ఆరోపణలు వైరల్!

Published: 17-02-2026, 11:05 PM
షాకింగ్: టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకి అన్యాయమా? సుప్రీత సంచలన ఆరోపణలు వైరల్!
  • తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వకుండా ఇతర భాషల హీరోయిన్లను ప్రోత్సహించడంపై సుప్రీత ఫైర్!
  • ముంబై నుండి హీరోయిన్లు దిగుమతి, నటన రాకపోయినా ఆఫర్లు! సుప్రీత సంచలన వ్యాఖ్యలు.
  • సురేఖ వాణి కూతురుగా నాకు అవకాశాలు రాలేదు, నన్ను నమ్మే ఆఫర్లు ఇస్తున్నారని సుప్రీత స్పష్టీకరణ!
  • అమరావతికి ఆహ్వానం చిత్రంలో నటించిన సుప్రీత, త్వరలో మరిన్ని సినిమాలతో బిజీ కానున్నారు.

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావడం లేదనే వాదన మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈసారి సురేఖ వాణి కూతురు సుప్రీత సంచలన ఆరోపణలు చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తెలుగు హీరోయిన్లకి అవకాశాలు లేవా?

సినిమాల్లో తెలుగు హీరోయిన్ల విషయంలో ఒక వివక్ష ఉంటుంది. తెలుగు హీరోయిన్లని కాకుండా ఇతర భాషాల హీరోయిన్లని ఎంకరేజ్‌ చేయడం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. దీంతో మన తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు. చిన్న చిన్న సినిమాలు, చిన్న పాత్రలకే పరిమితమవుతున్నారు. అదే కన్నడ హీరోయిన్లు, ముంబయి హీరోయిన్లకి మాత్రం భారీ ఆఫర్లు వస్తున్నాయి. పెద్ద పెద్ద సినిమాల్లో వాళ్లకే అవకాశాలిస్తున్నారు. ఇదే విషయంపై గతంలో చాలా మంది తెలుగు హీరోయిన్లు బహిరంగంగానే కామెంట్లు చేశారు. ఈషా రెబ్బ తన వాయిస్‌ని బలంగా వినిపించింది. ఇప్పుడు సుప్రీత తన వాయిస్‌ ని వినిపించింది.

సీనియర్‌ నటి సురేఖ వాణి కూతురు సైతం తన ఆవేదనని ఓపెన్‌గా వెల్లడించింది. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆఫర్లు ఇస్తామని పిలిచి హ్యాండిస్తారని తెలిపింది. సురేఖ వాణి కూతురు అని ఏ అవకాశం నాకు రాలేదు. నన్ను నమ్మే ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న మూడు సినిమాలు కూడా నన్ను నమ్మి వచ్చిన అవకాశాలే. ప్రతిచోట నెపోటిజం పనిచేయదు. తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రావాలని చెబుతున్నారు, కానీ అవకాశాలు ఇవ్వడం లేదు. నెగటివిటీ ఉందని, సురేఖ వాణి కూతురు అని, అసలే ఆఫర్లు ఇవ్వడం లేదు` అని వాపోయింది సుప్రీత.

ఇతర భాషల హీరోయిన్ల హవా!

ఇతర భాషల(కన్నడ, ముంబయి) హీరోయిన్లకి ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పింది. `కొంత మందికి లాంగ్వేజ్‌ రాదు, మరికొంత మందికి యాక్టింగే రాదు, వాళ్లని తెచ్చిపెట్టుకుంటున్నారు. అదే మాకు ఛాన్స్ లు ఇవ్వాల్సి వస్తే, `ఈ అమ్మాయిని సోషల్‌ మీడియాలో చూశాం, టీవీలో చూశారు కదా, మళ్లీ థియేటర్లో ఏం చూస్తారులే అని వద్దు అని చెప్పిన మాటలు నేనే విన్నాను` అని తెలిపారు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు సుప్రీత.

మరో ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ముంబయి నుంచి వాళ్లని తీసుకొస్తారు, వాళ్లకి భాష రాదు, యాక్టింగ్‌ రాదు, భావం రాదు, కేవలం గ్లామర్‌ ఉంటే సరిపోతుందా? మాకు అన్ని ఉన్నా కూడా ఆఫర్లు ఇస్తామని పిలిచి తీరా వెళ్లాక మొండి చేయి చూపిస్తున్నారు. ఇకనైనా ఈ ముంబయి పిచ్చి పక్కన పెట్టి, తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు ఇవ్వండి` అని సుప్రీత తెలిపారు. అమ్మకి నేమ్, మంచి పరిచయాలు ఉన్నప్పటికీ, ఆమె ఎప్పుడూ ఆఫర్ ఇవ్వమని అడగలేదని, నేను ఆఫర్లు సంపాదించుకోవాలని అనుకుంటుందని తెలిపారు. సుప్రీత కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

సుప్రీత కామెంట్స్ వైరల్!

సుప్రీత ఇటీవల `అమరావతికి ఆహ్వానం` అనే చిత్రంలో నటించింది. హీరోయిన్‌ తరహా పాత్ర అది. నటిగా మెప్పించింది సుప్రీత. కానీ ఈ మూవీ థియేటర్లోకి వచ్చిందనే విషయమే తెలియకుండా పోయింది. దీంతో ఇది ఆమెకి పెద్దగా ప్లస్‌ కాలేకపోయింది. ఇప్పుడు తమిళంలో ఓ మూవీ, తెలుగులో ఇంకో మూవీ చేస్తున్నట్టు తెలిపింది సుప్రీత. తనకు నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలు, ఇంపాక్ట్ ఉన్న పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. కథ, పాత్ర డిమాండ్‌ చేస్తే అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధమే అని తెలిపింది సుప్రీత.

సుప్రీత చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమె మాటలకు పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.