|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సురేఖ వాణికి మళ్లీ పెళ్లి చేసేందుకు కూతురి ప్రయత్నాలు! ఆమె సమాధానం వింటే షాక్!

Published: 08-02-2026, 4:35 AM
సురేఖ వాణికి మళ్లీ పెళ్లి చేసేందుకు కూతురి ప్రయత్నాలు! ఆమె సమాధానం వింటే షాక్!
  • సురేఖ వాణి కూతురు సుప్రీత తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని అనుకుంటుంది.
  • సుప్రీత పెళ్లి చేసుకునే ముందు తన తల్లికి పెళ్లి చేయాలనేది ఆమె కోరిక.
  • సురేఖ వాణి తన భర్త స్థానాన్ని ఎవరికీ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు.
  • సుప్రీత హీరోయిన్ గా ‘నాయుడు గారి అమ్మాయితో చౌదరి గారి అబ్బాయి’ సినిమాలో నటిస్తోంది.

ఒకప్పుడు నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న సురేఖ వాణి జీవితంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆమె కూతురు సుప్రీత, సురేఖ వాణికి మళ్లీ పెళ్లి చేయాలని అనుకుంటుంది. ఈ విషయంపై సురేఖ వాణి ఎలా స్పందించారో చూద్దాం.

సుప్రీత కోరిక ఏమిటి?

Surekha Vani:ఒకప్పుడు తల్లిగా, అక్కగా, అత్తగా , వదినగా ఇలా పలు క్యారెక్టర్లు పోషించి ప్రేక్షకులను అలరించిన సురేఖ వాణి(Surekha Vani) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈమె.. కరోనా సమయంలో అవకాశాలు లేకపోవడంతో ఇంటికే పరిమితమైంది. ఆ సమయంలో ఖాళీగా ఉండలేక తన కూతురితో కలిసి రీల్స్ చేయడం మొదలుపెట్టింది. కూతురితో పోటీ పడుతూ చిట్టి పొట్టి బట్టలు ధరించి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది సురేఖ వాణి. ఆ సమయంలో చాలామంది వీరిపై విమర్శలు గుప్పించారు. మరికొంతమంది వీరికి అండగా నిలిచారు. ఏదేమైనా సురేఖ వాణి మాత్రం తన కూతురికి ఇండస్ట్రీలోకి రాకముందే భారీ పాపులారిటీని సంపాదించి పెట్టింది.

ఇక పబ్బులకు, వెకేషన్ లకు వెళ్తూ గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు ఈ తల్లీకూతుళ్లు. ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ తో సుప్రీత ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. అలా బిగ్ బాస్ సీజన్ 7రన్నరప్ అమర్దీప్ చౌదరి (Amardeep choudhary) హీరోగా నటిస్తున్న ‘నాయుడు గారి అమ్మాయితో చౌదరి గారి అబ్బాయి’ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉండగా మరొకవైపు సుప్రీత తన తల్లి సురేఖా వాణికి మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించుకుందట. అందులో భాగంగానే తన తల్లితో ఈ విషయాన్ని చెబితే .. సురేఖ వాణి ఊహించని సమాధానం చెప్పినట్లు సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సురేఖ వాణి సమాధానం ఏంటి?

ఇకపోతే నిత్యం సోషల్ మీడియా గ్లామర్ వలకబోస్తూ ఆకట్టుకునే సుప్రీత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. అందులో భాగంగానే వ్యక్తిగత జీవిత విషయానికి సంబంధించిన ప్రశ్న ఎదురవగా.. దానికి సుప్రీత మాట్లాడుతూ..” మా అమ్మ సురేఖ వాణికి ఒక తోడు ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నాను. భవిష్యత్తులో నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మా అమ్మ ఒంటరి అవుతుంది. అందుకే నా తల్లితో పాటు కుటుంబ సభ్యులతో కూడా ఈ విషయం గురించి చర్చించాను. అయితే మా అమ్మ మాత్రం మా నాన్న స్థానాన్ని మరెవరికి ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఆమె నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. నిజానికి నా పెళ్లి కంటే ముందే మా అమ్మకు పెళ్లి చేసి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ దానికి మా అమ్మ ఒప్పుకోవడం లేదు” అంటూ సురేఖ వాణి రియాక్షన్ పై ఊహించని కామెంట్లు చేసింది సుప్రీత.

సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ

“మా అమ్మకు సరైన తోడు దొరికితే నేను చాలా సంతోషంగా భావిస్తాను. ముఖ్యంగా ఆమెను జీవితాంతం బాగా చూసుకుంటాను. ఆమె కోరుకున్న ప్రతి కోరికను నెరవేరుస్తాను. మా అమ్మ ప్రేమ పై నాకు ఏ మాత్రం పొసిసివ్ లేదు. మా అమ్మ తన ప్రేమను మా పెంపుడు కుక్క కృష్ణకి కూడా పంచుతుంటుంది” అంటూ చెప్పుకొచ్చింది.. ఇకపోతే తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయాలపై కూడా స్పందించింది సుప్రీత. “నన్ను అర్థం చేసుకుంటే చాలు.. భరిస్తే చాలు” అంటూ బదులిచ్చింది. ఇక తాను చేపల పులుసు, పులావ్, దమ్ బిర్యానీ వంటివి బాగా చేస్తానని, చికెన్ ఫ్రై లో తాను ప్రో అని చెప్పుకొచ్చింది.

మొత్తానికి సుప్రీత తన తల్లికి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉండగా, సురేఖ వాణి మాత్రం తన భర్త స్థానాన్ని ఎవరికీ ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.