
📌 Key Points
- సూర్య 46 చిత్రానికి ‘విశ్వనాధన్ అండ్ సన్స్’ టైటిల్ పరిశీలనలో ఉంది.
- వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న చిత్రం.
- ఫిబ్రవరి 15న సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.
- ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేసే అవకాశం ఉంది, మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది.
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ‘సూర్య 46’ చిత్రం టైటిల్ ఖరారైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘విశ్వనాధన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఫిబ్రవరి 15న వెల్లడికానున్నాయి.
సూర్య 46 టైటిల్ ఇదేనా?
Suriya 46: కోలీవుడ్ స్టార్ సూర్య ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామలీ ఓరియంటెడ్ చిత్రం ‘సూర్య 46’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా టైటిల్ ‘విశ్వనాధన్ అండ్ సన్స్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు చిత్ర పరిశ్రమలో వార్త తెగ చక్కర్లు కొడుతోంది. లక్కీ భాస్కర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్న వెంకీ అట్లూరి సూర్య సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు విడుదల చేసేందుకు మూవీ టీ సిద్దమైంది. పూర్త వివరాలు ఫిబ్రవరి 15 వ తేదీన వెళ్లడించనున్నరు. ఈ సినిమా అప్డేట్ కోసం సూర్య అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also- Dhurandhar The Revenge Teaser: రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ ది రివేంజ్’ టీజర్ వచ్చేసింది చూశారా.. ఈ సారి తెలుగులో..
ఫిబ్రవరి 15న పూర్తి వివరాలు
ఈ సినిమా పీరియడ్ డ్రామా లేదా ఒక బలమైన సామాజిక అంశంతో కూడిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఇందులో సూర్య ఒక విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం 45 ఏళ్ల వ్యక్తికి, 20 ఏళ్ల యువతికి మధ్య ఉండే సంబంధం చుట్టూ తిరుగుతుందని సమాచారం. సూర్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం (Dual Role) చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చే జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ (OTT) హక్కులను నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ద్విపాత్రాభినయంలో సూర్య?
Read also- Shruti Haasan: గొప్ప మనసు చాటుకున్న శృతిహాసన్.. చిన్నారి పాలిట దేవతగా!
సూర్య 46 చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫిబ్రవరి 15న విడుదల కానున్న పూర్తి వివరాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం సూర్య కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశిద్దాం.


