|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Actor Karthi: అప్పుడు అబ్బాయితో… ఇప్పుడు బాబాయ్‌తో పోటి… అన్నగారు వస్తారు రిలీజ్‌పై కార్తీ రియాక్షన్

Published: 10-12-2025, 4:48 AM
Actor Karthi: అప్పుడు అబ్బాయితో… ఇప్పుడు బాబాయ్‌తో పోటి… అన్నగారు వస్తారు రిలీజ్‌పై కార్తీ రియాక్షన్
  • నటుడు కార్తీ నటిస్తున్న ‘అన్నగారు వస్తారు’ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • కార్తీ సినిమా బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’తో ఒకే రోజు విడుదలవుతూ పోటీ పడనుంది.
  • గతంలో ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాతో తన ‘సత్యం సుందరం’ పోటీ పడినట్లు కార్తీ గుర్తుచేశారు.
  • విడుదల తేదీలను నియంత్రించలేనని, రెండు సినిమాలు మంచి విజయం సాధిస్తాయని కార్తీ ఆశాభావం వ్యక్తం చేశారు.

కోలీవుడ్ నటుడు కార్తీ నటిస్తున్న ‘అన్నగారు వస్తారు’ డిసెంబర్ 12న విడుదల కానుంది. అదే రోజు బాలకృష్ణ ‘అఖండ 2’ విడుదల కావడంతో పోటీ నెలకొంది. ఈ పోటీపై కార్తీ స్పందిస్తూ, గతంలో ఎన్టీఆర్ సినిమాతో తన సినిమా పోటీ పడిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

‘అన్నగారు వస్తారు’ – విడుదల వివరాలు

Actor Karthi: కోలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు కార్తీ(Karthi) అన్నగారు వస్తారు(Annagaru Vostaru) అనే సినిమా ద్వారా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నలన్ కుమార స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమా తమిళంలో వా వాతియార్ అనే పేరుతో విడుదల కాగా తెలుగులో మాత్రం అన్నగారు వస్తారు అనే పేరిట విడుదల కానుంది. ఈ సినిమాలో కార్తి డీఎస్పీ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక కార్తీ జోడిగా కృతి శెట్టి(Kriti Shetty) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో గత రాత్రి హైదరాబాద్లో ఎంతో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. అలాగే కార్తీ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటూ ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అఖండ 2 సినిమాతో పోటీగా అన్నగారు వస్తారు సినిమా విడుదలవడం గురించి కార్తీ స్పందించారు. అఖండ 2 డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కావాల్సి ఉండేది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ డిసెంబర్ 12వ తేదీ విడుదల కానుంది.

బాలయ్య ‘అఖండ 2’తో పోటీపై కార్తీ

ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ విడుదల కావడంతో అదే రోజు విడుదలవుతున్న సినిమాలన్నీ కూడా తప్పుకున్నాయి కానీ కార్తీ మాత్రం బాలయ్యకు పోటిగా తన సినిమాని విడుదల చేస్తున్నారు. ఇక ఈ విషయంపై కార్తీ స్పందిస్తూ.. గతంలో తాను నటించిన సత్యం సుందరం సినిమా ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాతో పోటీ పడాల్సి వచ్చిందని తెలిపారు.ఇప్పుడు ఊహించని విధంగా అఖండ 2 తో అన్నగారు వస్తారు పోటీ పడబోతోందని తెలిపారు. ఒక ప్రేక్షకుడిగా నేను అన్ని సినిమాలను చూడటానికి ఎంతో ఇష్టపడతాను కానీ, హీరోగా విడుదల తేదీలను కంట్రోల్ చేసే స్థాయిలో తానులేనని తెలిపారు. ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ అందుకుంటాయని నేను భావిస్తున్నాను అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు.

బాలయ్యకు పోటీగా సక్సెస్ కొట్టేనా?

గత పోటీలు, కార్తీ అభిప్రాయం

అఖండ 2 డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో కార్తీ అన్నగారు వస్తారు సినిమా కూడా డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసుకున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ డిసెంబర్ 12వ తేదీ విడుదలకు సిద్ధమైంది. అయితే ఇదే రోజున బాలయ్య సినిమా కూడా విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతుందని తెలుస్తుంది. మరి బాలకృష్ణ సినిమా తో పోటీగా కార్తీ నిలబడి సక్సెస్ అందుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మొత్తంమీద, ‘అన్నగారు వస్తారు’ మరియు ‘అఖండ 2’ ఒకే రోజు విడుదలవడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. బాలయ్యతో పోటీపై కార్తీ ధీమాతో ఉండటం విశేషం. రెండు సినిమాలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.