|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సుశాంత్ తో పెళ్లి రూమర్స్ పై మీనాక్షి చౌదరి సంచలన స్పందన!

Published: 06-01-2026, 2:00 AM
సుశాంత్ తో పెళ్లి రూమర్స్ పై మీనాక్షి చౌదరి సంచలన స్పందన!
  • మీనాక్షి చౌదరి ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
  • సుశాంత్‌తో పెళ్లి రూమర్స్ పై మీనాక్షి చౌదరి స్పందించింది.
  • ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో సుశాంత్ తో పరిచయం ఏర్పడిందని మీనాక్షి తెలిపింది.
  • తాము మంచి స్నేహితులం తప్ప మరే బంధం లేదని మీనాక్షి చౌదరి స్పష్టం చేసింది.

హీరోయిన్ మీనాక్షి చౌదరి తన కొత్త సినిమా ‘అనగనగా ఒక రాజు’ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా సుశాంత్‌తో తన పెళ్లి రూమర్స్ పై ఆమె స్పందించింది. తమ మధ్య స్నేహం తప్ప ఎఫైర్ లేదని, కెరీర్‌పైనే తన దృష్టి అని మీనాక్షి స్పష్టం చేసింది.

మీనాక్షి చౌదరి-సుశాంత్ ల మధ్య బంధం ఏంటి?

Meenakshi Chaudhary: ఈ సంక్రాంతితో హ్యాట్రిక్ కొట్టాలని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) తాజాగా అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న చిత్రం ఇది. భారీ అంచనాలతో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇకపోతే జనవరి 14వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్రబృందం. అందులో భాగంగానే మీనాక్షి చౌదరి కూడా తన ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ అటు పెళ్లి రూమర్స్ పైనే కాకుండా ఇటు సుశాంత్ తో పెళ్లి అంటూ వస్తున్న రూమర్స్ పై కూడా క్లారిటీ ఇచ్చి స్పందించింది .

ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మీనాక్షి చౌదరి. సుశాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా 2021లో విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మీనాక్షి – సుశాంత్ మధ్య పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త ఇప్పుడు ప్రేమగా మారిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. ఇంటర్వ్యూలో భాగంగా సుశాంత్ తో మీనాక్షి పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి కదా.. దీనిపై మీ స్పందన ఏంటి అని యాంకర్ ప్రశ్నించింది.

ఎఫైర్ రూమర్స్ పై మీనాక్షి చౌదరి క్లారిటీ

మీనాక్షి చౌదరి మాట్లాడుతూ..” సినిమా కెరియర్ కొనసాగిస్తున్నప్పుడు ఇలాంటి రూమర్స్ రావడం చాలా సహజం .ముఖ్యంగా ఇచ్చట వాహనములు నిరుపరాదు అనే సినిమాతో నేను ఇండస్ట్రీకి పరిచయమయ్యాను. నా మొదటి సినిమా హీరో సుశాంత్. అప్పటి నుంచీ నాకు సుశాంత్ తో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇది తప్ప మా మధ్య ఇంకేం లేదు. అయితే ఇలాంటి రూమర్స్ అనేవి మన జాబ్లో ఒక పార్ట్ మాత్రమే. వీటిని తలకెక్కించుకొని స్ట్రెస్ తీసుకోవాలని నేను అనుకోవట్లేదు. ఇలాంటి రూమర్స్ ను పట్టించుకుంటే జీవితంలో ముందుకు వెళ్లలేము. నాకు నా కెరియర్ పై ఎన్నో గోల్స్ ఉన్నాయి. వాటన్నింటినీ నేను రీచ్ అవ్వాలి” అంటూ సుశాంత్ తో పెళ్లి అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది మీనాక్షి చౌదరి. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అనగనగా ఒక రాజు సినిమా ప్రమోషన్స్

ఇకపోతే త్వరలో మీనాక్షి పెళ్లి అంటూ వస్తున్న పెళ్లి వార్తలకి కూడా క్లారిటీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. “అసలు ఈ రూమర్స్ ఎక్కడ ఎలా సృష్టిస్తారో అర్థం కావడం లేదు. కథ , పాత్రకు ప్రాధాన్యత ఇస్తాను. కథ బాగుంటే ఎలాంటి పాత్రలోనైనా చేస్తాను. ఇక నేను పెళ్లి చేసుకోనున్నట్లు కూడా ఇటీవల ఎన్నో వార్తలు వచ్చాయి. అవన్నీ రూమర్స్.. విని అలసిపోయాను. వాటిలో నిజం లేదు. ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది మీనాక్షి.

మీనాక్షి చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన పెళ్లి రూమర్స్‌పై పూర్తి క్లారిటీ ఇస్తూ, కెరీర్‌కు ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం అభిమానులకు ఊరటనిచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.