
📌 Key Points
- చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మూవీగా ‘మన శంకర వరప్రసాద్‌గారు’.
- నిర్మాతగా సుస్మిత కొణిదెల, సాహు గారపాటి.. తండ్రికి భారీ విజయాన్ని అందించారు.
- రాఖీకి చరణ్ ఇచ్చే గిఫ్ట్‌లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సుస్మిత కొణిదెల.
- సినిమా చూసి ‘దిష్టి తగులుతుంది’ అని ఈవిల్ ఐ గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్.. వైరల్ అవుతున్న న్యూస్.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాత సుస్మిత కొణిదెల గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. రామ్ చరణ్ ఆమెకు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చాడట!
మన శంకర వరప్రసాద్‌గారు సక్సెస్ వెనుక సుస్మిత!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’(Mana Shanakara Varaprasad Garu) చిత్రం సంకాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్ల విషయంలో కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక నయనతార(Nayanatara) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో వెంకటేష్(Venkatesh) కీ రోల్ ప్లే చేసింది.
రామ్ చరణ్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
అయితే ఈ సినిమాకు నిర్మాత సాహు గారపాటితోపాటు మెగా డాటర్ సుస్మిత కొణిదెల(Sushmitha Konidela) నిర్మాతగా వ్యవహరించారు. తండ్రి ఖాతాలో భారీ విజయాన్ని జమ చేశారు సుస్మిత. ప్రజెంట్ ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సుస్మిత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రామ్ చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాకు రామ్ చరణ్ ప్రతీ రాఖీకు చిన్న చిన్న గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు.
సుస్మిత కొణిదెల కామెంట్స్ వైరల్!
నాకు ఏది ఇష్టమో అది కనుక్కొని ఇస్తాడు. అయితే రీసెంట్‌గా కూడా ఒక గిఫ్ట్ ఇచ్చాడు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూసి వచ్చి.. “నాన్నతో చాలా బాగా చేశావ్.. సినిమా చాలా బాగుంది.. ఇప్పుడు నీకు చాలా దిష్టి తగులుతుంది” అని చెప్పి వేసుకోమని రామ్ చరణ్ ‘ఈవిల్ ఐ’ గిఫ్ట్ ఇచ్చాడు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
సుస్మిత కొణిదెల చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్, సుస్మితల మధ్య ఉన్న అనుబంధంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని టాలీవుడ్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


