
📌 Key Points
- చిరంజీవి సినిమా సక్సెస్ మీట్‌లో ఉపాసన గురించి సుష్మిత కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు.
- ఉపాసన చేసే వంటలు పిల్లలకు చాలా ఇష్టమని సుష్మిత తెలిపింది.
- తాము ప్రతి ఆదివారం లేదా పండుగలకు ఉపాసన ఇంట్లోనే ఉంటామని సుష్మిత వెల్లడించింది.
- క్లింకారాకు సినిమా సక్సెస్ సందర్భంగా ఏదైనా గిఫ్ట్ ఇచ్చారా అని ప్రశ్నించారు.
చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సందర్భంగా నిర్మాత సుష్మిత కొణిదెల ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఉపాసన గురించి సుష్మిత ఏమన్నారంటే?
Sushmitha Konidela : ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వచ్చిన చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవలే సక్సెస్ మీట్ని గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ఈ చిత్రం అనుకున్న దానికన్నా ఎక్కువగా సక్సెస్ అవ్వడంతో చిత్రం యూనిట్ పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. ఒకవైపు డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటుగా నిర్మాత సుష్మిత కొణిదెల కూడా పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఆమె ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో సుస్మిత పై రామ్ చరణ్ అభిమానులు, అలాగే మెగా అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. అసలు సుస్మిత ఉపాసన గురించి ఏం చెప్పిందో ఒకసారి మనం తెలుసుకుందాం..
‘మన శంకర్ వరప్రసాద్ గారు ‘ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఇంటర్వ్యూ ఇస్తూ తమ సక్సెస్ ను అందరితో షేర్ చేసుకుంటున్నారు.. ఈ చిత్ర డైరెక్టర్ అనిల్ రావిపూడి పలు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలు చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.. ఈ సినిమాకు నిర్మాతక వ్యవహరించిన సుస్మిత కొణిదల సినిమా గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ కి హాజరైన ఈమె మాట్లాడుతూ.. నాన్న గారితో సినిమా తీయాలన్న కోరిక నెరవేరింది. సినిమా కూడా మంచి హిట్ అవడంతో నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమె చెప్పుకొచ్చారు.. అయితే ఈ ఇంటర్వ్యూలో ఉపాసన గురించి ప్రస్తావన వచ్చింది. రామ్ చరణ్ భార్య ఉపాసన ఇంట్లో వంట చేస్తారా? అని యాంకర్ అడుగుతారు.. ఆ మాటకు సుస్మిత సమాధానం చెప్పింది. ఉపాసన వంట చేస్తుంది. అయితే ఆమె చేసే వంటలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి.. మాకన్న ఎక్కువగా పిల్లలు బాగా ఇష్టపడి తింటారు అని చెప్పింది. అంతే కాదు అందరూ దూరంగా ఉంటారు కదా.. మరి ఎలా కలుస్తారు అని అడుగుతారు.. వాళ్లందరూ కలిసే ఉంటారు. నేను నా పిల్లలు మాత్రమే వేరేగా ఉంటాము. ప్రతి ఆదివారము లేదా ఫెస్టివల్స్ కి అక్కడే ఉంటాము అని సుస్మిత అన్నారు..
సుష్మిత కామెంట్స్‌పై మెగా అభిమానుల స్పందన
క్లింకారాకు సుష్మిత ఏమిచ్చారు?
ఇక క్లింకార విషయాన్ని కూడా ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తారు.. సినిమా ఇంత సక్సెస్ అయింది కదా.. బాగా డబ్బులు వచ్చాయి కదా.. మరి క్లింకారా ఏదైనా గిఫ్ట్ ఇచ్చారని అడుగుతారు.. సినిమాకు డబ్బులు వచ్చాయని నేను ఇవ్వలేదు కానీ.. ప్రతి బర్త్ డే కి దానికి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే వస్తున్నాను అని సుస్మిత అంటుంది.. ఇక చివరిగా చిరంజీవి గారు దోసలు బాగా వేస్తారు.. ఆయన ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అందరికీ దోసలు వేయడం నాకు చాలా బాగా నచ్చింది అని యాంకర్ అంటారు. నాన్నకు పిల్లలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ మేం వెళ్లిన సరే.. అందరికీ ఇష్టమైన వంటలను తానే స్వయంగా వండి పెడతారు. బాగా వంటలు చేస్తారు అని చిరంజీవి గురించి కూడా సుస్మిత చెబుతుంది.. ఇక అలాగే సినిమాకు డబ్బులు బాగా వచ్చాయి కదా మరి మరో సినిమా చేయడానికి మీ నాన్నగారికి అడ్వాన్స్ ఇచ్చారా? అని అడుగుతారు.. ఇంకా సినిమా రన్ అవుతుంది కదా అది అయిన తర్వాత ఇంకొక సినిమాకి ప్లాన్ చేస్తున్నామని సుస్మిత చెబుతుంది. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ వీడియో కాస్త ఫన్నీగా, సరదాగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..
మొత్తానికి సుష్మిత కొణిదెల ఉపాసన గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు ఈ ఇంటర్వ్యూను తెగ షేర్ చేస్తున్నారు.


