|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రజనీకాంత్ వార్నింగ్.. మోహన్ బాబు షాకింగ్ కౌంటర్! అసలు ఏం జరిగిందంటే?

Published: 14-05-2026, 5:45 PM
రజనీకాంత్ వార్నింగ్.. మోహన్ బాబు షాకింగ్ కౌంటర్! అసలు ఏం జరిగిందంటే?
  • రజనీకాంత్, మోహన్ బాబుల స్నేహం నాలుగు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా కొనసాగుతోంది.
  • రజనీకాంత్ బెంగళూరులోని శ్రీశ్రీ రవిశంకర్ ఆశ్రమానికి మోహన్ బాబును ఆహ్వానించారు.
  • మోహన్ బాబు మొదట నిరాకరించగా, రజనీ సరదాగా హెచ్చరించారు.
  • రజనీ హెచ్చరిక వెనుక స్నేహితుడి శ్రేయస్సు కోరే తపన ఉందని మోహన్ బాబు గ్రహించారు.

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా మోహన్ బాబు రజనీకాంత్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. రజనీ ఆధ్యాత్మిక ఆహ్వానానికి మోహన్ బాబు ఇచ్చిన అదిరిపోయే కౌంటర్, రజనీ వార్నింగ్ వెనుక ఉన్న కథ ఇప్పుడు వైరల్ అవుతోంది.

రజనీకాంత్ ఆధ్యాత్మిక ఆహ్వానం

Rajini Friendship : టాలీవుడ్ ‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు, కోలీవుడ్ ‘సూపర్ స్టార్’ రజనీకాంత్.. ఈ ఇద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంటుందో తెలుగు, తమిళ ప్రేక్షకులందరికీ తెలిసిందే.సిల్వర్ స్క్రీన్ పై వీరిద్దరికీ ఎంతటి ఇమేజ్ ఉందో అంతకు మించిన ఫ్రెండ్ షిప్ వీళ్ళ మధ్య ఉంది. సుమారు నాలుగు దశాబ్దాలుగా వీరి స్నేహం చెక్కుచెదరకుండా కొనసాగుతోంది. ఇక తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ బాబు, తన ప్రాణ మిత్రుడు రజనీకాంత్‌కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అక్కడున్న వారితో షేర్ చేసుకోవడంతో అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అయ్యింది.

నువ్వు ఇక్కడికి రావాల్సిందే

ఆధ్యాత్మికతకు రజనీకాంత్ ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిమాలయాలకు వెళ్లినా, ధ్యానం చేసినా ఆయన తన మిత్రులు, సన్నిహితులు కూడా ఆ ప్రశాంతతను అనుభవించాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఒకసారి రజనీకాంత్ తన మిత్రుడు మోహన్ బాబుకు ఫోన్ చేసి బెంగళూరు రమ్మని పిలిచారట. ఆ సమయంలో జరిగిన క్రేజీ టాపిక్ ని మోహన్ బాబు సరదాగా గుర్తు చేసుకున్నారు. “రేయ్.. నువ్వు వెంటనే నీ భార్యను తీసుకుని బెంగళూరు వచ్చేయ్.. ఇక్కడ శ్రీశ్రీ రవిశంకర్ గురుదేవ్ గారి ఆశ్రమంలో ఉన్నాను. ఆయన అద్భుతమైన గురువు, నువ్వు ఇక్కడికి రావాల్సిందే” అని ఆర్డర్ వేశాడట రజనీ.

మోహన్ బాబు అదిరిపోయే కౌంటర్

అయితే ఆ సమయంలో మోహన్ బాబు కాస్త సరదాగా, పంతంగా బదులిస్తూ.. “ఎవరా గురువు? ఆయన ఎవరికి గురువు? నేనెందుకు రావాలి? నేను రాను” వచ్చినా నమస్తే పెడతాను కానీ ఆయన కాళ్ళకి అస్సలు దండం పెట్టను. అంటూ తెగేసి చెప్పారట. ఆ మాట వినగానే రజనీకాంత్‌కు ఒక్కసారిగా కోపం వచ్చేసిందట. ఫోన్ లోనే మోహన్ బాబును తనదైన శైలిలో గట్టిగా తిట్టేశారట. “నీకు ఆ గురువు గొప్పతనం తెలియడం లేదు, అంత అహంకారం పనికిరాదు” అంటూ ఫ్రెండ్లీ గా వార్నింగ్ ఇచ్చాడట.ఇక తన ఆప్త మిత్రుడు అంతగా కోప్పడుతుంటే మోహన్ బాబు నవ్వుకున్నారట. అది తిట్టడం కాదు.. తన స్నేహితుడు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉండి ప్రశాంతంగా ఉండాలనే తపన అని మోహన్ బాబు ఆ తర్వాత అర్థం చేసుకున్నారట.

పాపారాయుడు పాత్రకి ప్రాణం పోసిన రజినీ

స్నేహం వెనుక ఉన్న అసలు కథ

ఇక వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ విషయానికి వస్తే అది ఈనాటిది కాదు. 1995లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ ‘పెదరాయుడు’ సినిమా మోహన్ బాబు కెరీర్‌లో సాలిడ్ బ్లాక్ బాస్టర్ అవడానికి కారణం రజినీ అన్న సంగతి తెల్సిందే.ముఖ్యంగా ఆ సినిమాలోని పాపారాయుడు పాత్రకి రజినీ ప్రాణం పోశాడనే చెప్పాలి. రెమ్యూనరేషన్ ఆశించకుండా కేవలం స్నేహం కోసం ఆయన ఆ సినిమాలో నటించారు రజినీ .అంతకుముందు కూడా ‘శివశక్తి’,తొలిరేయి గడిచింది (1977),అమ్మ ఎవరికైనా అమ్మ వంటి చిత్రాల్లో వీరు కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు.

రజనీకాంత్ ఏపీకి వచ్చినా లేదా మోహన్ బాబు చెన్నై వెళ్లినా.. ఎంత బిజీగా ఉన్నా ఒకరినొకరు కలుసుకోకుండా ఉండలేరు. ఇటీవల మోహన్ బాబు ఇంట్లో జరిగిన పలు వేడుకలకు రజనీకాంత్ హాజరై సందడి చేశారు కూడా. ఎంత ఎత్తుకు ఎదిగినా, సినిమా ప్రపంచంలో ఎలాంటి పోటీ ఉన్నా.. పర్సనల్ లైఫ్ లో మాత్రం వీరిద్దరూ ఇంకా ఆ పాత మిత్రులుగానే ఉండిపోవడం గమనార్హం. అయితే షూటింగ్స్ మధ్య గ్యాప్ దొరికితే చాలు, ఈ ఇద్దరు దిగ్గజాలు ఇలాంటి సరదా ఫోన్ కాల్స్‌తో తమ స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు. రజనీకాంత్ తిట్టినా అది తన మేలు కోసమేనని మోహన్ బాబు చెప్పిన ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ ఘటన రజనీకాంత్, మోహన్ బాబుల మధ్య ఉన్న లోతైన అనుబంధాన్ని, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. వారి స్నేహం కేవలం సినిమా రంగానికే పరిమితం కాదని, వ్యక్తిగత జీవితంలోనూ ఎంత బలమైనదో ఈ సంఘటన నిరూపించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.