
📌 Key Points
- ‘సువర్ణ’ సినిమాలో పల్లవి నటన హైలైట్‌గా నిలిచింది. ఆమె హౌస్ వైఫ్ పాత్రలో అద్భుతంగా నటించింది.
- షకలక శంకర్ కామెడీ టైమింగ్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు, పవన్ కామెడీ సీన్స్‌లో నవ్వించాడు.
- దర్శకుడు అశోక్ రొయ్య తక్కువ బడ్జెట్‌లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ చేశారు.
- మొబైల్ ఫోన్‌లో దెయ్యం ఉండటం అనే కొత్త అంశం సినిమాలో ఆసక్తికరంగా చూపించారు.
నేటి యువత సెల్ ఫోన్లకు ఎంతలా బానిసలయ్యారో తెలిపే చిత్రం ‘సువర్ణ’. మొబైల్ ఫోన్ మాయాజాలంలో చిక్కుకొని ఎలా భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారో ఈ సినిమాలో చూడవచ్చు. పల్లవి, షకలక శంకర్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.
కథా నేపథ్యం & నటీనటుల నటన
Suvarna Review: సెల్ ఫోన్ లేని ప్రపంచాన్ని ఈరోజుల్లో ఊహించుకోగలమా..అంతెందుకు ఇప్పుడున్న డిజిటల్ యుగంలో మొబైల్ లేకపోతె ముద్ద దిగదు.. నిద్ర పట్టదు. సరిగ్గా ఇలాంటి పాయింట్ నే బేస్ చేసుకొని మొబైల్ ఫోన్ ఒక మాయా ప్రపంచంలా మారి నేటి యూత్ ని ఎలా బలి తీసుకుంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించిన చిత్రమే ‘సువర్ణ’. ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై అశోక్ రొయ్య స్వీయ దర్శకత్వంలో పల్లవి, షకలక శంకర్, జగదీష్, వర్ణిక, జబర్దస్త్ రాజమౌళి, పవన్, దేవి, శివ, శ్రీహరి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ రోజే అంటే ఏప్రిల్ 3న థియేటర్లలోకి వచ్చేసింది. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూసేద్దాం.
కథ లోకి ఎంట్రీ ఇస్తే ఒక అందమైన జంట కొత్తగా ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు. భర్త తన కన్స్ట్రక్షన్ పనుల్లో బిజీగా ఉండగా, భార్య ఇల్లు సర్దుకుంటున్న సమయంలో ఆమెకు ఒక పాత మొబైల్ ఫోన్ దొరుకుతుంది.ఇక ఆ ఫోన్ చేతిలోకి వచ్చినప్పటి నుండి ఆమె ప్రవర్తన విచిత్రంగా మారుతుంది.ఒకరకంగా చెప్పాలంటే ఆమెకు ‘రీల్స్ దెయ్యం’ పడుతుంది.అలా ఎప్పుడూ ఫోన్ పట్టుకుని పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తూ, వింతగా ప్రవర్తిస్తుంటుంది.దాంతో అసలు ఆ ఫోన్ ఎవరిది?దాని వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటి? దెయ్యం ఆవహించిన తన భార్యను భర్త ఎలా కాపాడుకున్నాడు? అనేదే సినిమా కథ.
పల్లవి చూపించిన ఎక్స్ప్రెషన్స్ హైలెట్
దర్శకుడి ప్రతిభ, సాంకేతిక అంశాలు
ఈ సినిమాలో జబర్త్దస్ట్ నటుడు షకలక శంకర్ తప్ప మిగిలిన వారంతా దాదాపు కొత్తవారే.అయినప్పటికీ అందరూ తమ పాత్రల్లో జీవించారనే చెప్పాలి.ఇక మహాలక్ష్మి పాత్రలో పల్లవి నటన హైలైట్.హౌస్ వైఫ్ గా,దెయ్యం పట్టిన స్త్రీగా పల్లవి చూపించిన ఎక్స్ప్రెషన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి.ఇక షకలక శంకర్ తన మార్కు కామెడీ టైమింగ్‌తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేయగా ,కామెడీ సీన్స్‌లో పవన్ అద్భుతంగా పండించి ప్రేక్షకులను నవ్వించాడు.ఇక జగదీష్, వర్ణిక, జబర్దస్త్ రాజమౌళి తదితరులు తమ పరిధిలో ఆకట్టుకున్నారు.
ఎక్కడా రాజీ పడని డైరెక్టర్
తక్కువ బడ్జెట్ అయినా దర్శక నిర్మాత అశోక్ రొయ్య ఎక్కడా రాజీ పడకుండా అందమైన లొకేషన్లలో చిత్రాన్ని షూట్ చేయడం విశేషం. అయితే కథ కాస్త రొటీన్‌గా అనిపించినా, దెయ్యం మొబైల్ ఫోన్‌లో ఉండటం అనే కొత్త పాయింట్ ని మెచ్చుకోతగ్గదే.ఇక సినిమాకి అందించిన సంగీతం ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. ఒకరకంగా చెప్పాలంటే భయపెట్టే హారర్ సీన్లు, నవ్వించే కామెడీ పంచ్‌లు అన్నీ సరిగ్గా కుదిరిపోయాయ్.
సినిమా చూడదగినదా? లేదా?
నేటి యువతకు ఈ సినిమా ఒక హెచ్చరిక
ముఖ్యంగా సినిమా చివరిలో వచ్చే క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కాకుండా, మొబైల్ ఫోన్ మాయలో పడి ప్రస్తుతం ఉన్న లైఫ్ ని,బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్న నేటి యువతకు ఈ సినిమా ఒక హెచ్చరిక లాంటిదే.ఇక ‘సువర్ణ’ కేవలం ఒక హారర్ కామెడీ చిత్రం మాత్రమే కాదు, ప్రతి ఫ్యామిలీ కలిసి చూడాల్సిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. మరి మీరు కూడా రీల్స్ పిచ్చిలో ఉన్నారా? అయితే వెంటనే ఈ సినిమా చూసి ఆ మాయలోంచి బయటపడండి!
మొత్తానికి ‘సువర్ణ’ చిత్రం నేటి యువత మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారడం వల్ల ఎదురయ్యే పరిణామాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. కామెడీ, హారర్ అంశాలు మేళవించి ఉన్న ఈ సినిమా ఒకసారి చూడదగినది.


