|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టీఎంసీకి 24 గంటల డెడ్‌లైన్: సువేందు సంచలన వ్యాఖ్యలు!

Published: 04-05-2026, 5:45 PM
టీఎంసీకి 24 గంటల డెడ్‌లైన్: సువేందు సంచలన వ్యాఖ్యలు!
  • టీఎంసీ 24 గంటల్లో అంతమైపోతుందని సువేందు అధికారి వ్యాఖ్యానించారు.
  • అవినీతి, వారసత్వ రాజకీయాలతో టీఎంసీ నిండిపోయిందని ఆరోపణ.
  • కొందరు గుండాల అండతోనే టీఎంసీ నడుస్తుందని సువేందు షాకింగ్ వ్యాఖ్యలు.
  • పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పెత్తనానికి చెక్ పెడతామని వెల్లడి.

వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించిన బీజేపీ నేత సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ పార్టీ 24 గంటల్లో నాశనం అవుతుందని, అవినీతి, వారసత్వ రాజకీయాలతో నిండిపోయిందని ఆరోపించారు. మమతా రాజకీయ ప్రస్థానం ముగిసిందని విమర్శించారు.

టీఎంసీకి 24 గంటల్లో అంతం: సువేందు హెచ్చరిక

వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించిన బీజేపీ నేత సువేందు అధికారి.. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. 24 గంటల్లో TMC పార్టీ నాశనం అయిపోతుందన్నారు. అవినీతి, వారసత్వ రాజకీయాలతో నిండిపోయిన ఆ పార్టీ… కొందరు గుండాల అండతోనే నడుస్తోందని షాకింగ్ ఆరోపణలు చేశారు. ఆ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానం ముగిసిందని విమర్శలు చేశారు బీజేపీ నేత సువేందు అధికారి.. ఇకపై పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ పెత్తనం ఎక్కడ సాగకుండా చేస్తామని వెల్లడించారు. ఇది ఇలా ఉండగా నందిగ్రామ్, భవానీ పూర్ లో హిందువులే తనను గెలిపించాలని గుర్తు చేశారు.

A post shared by Prafful Garg (@praffulgarg)

అవినీతి, వారసత్వ రాజకీయాలపై సువేందు విమర్శలు

వెస్ట్ బెంగాల్‌లో మమతా పెత్తనానికి చెక్?

సువేందు అధికారి వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. టీఎంసీ భవిష్యత్తు, మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానంపై ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.